నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Published Wed, May 9 2018 9:37 AM

Stockmarkets opens  Flat - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి మళ్లాయి.  సెన్సెక్స్‌ 42 పాయింట్లు క్షీణించి 35,174  వద్ద నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 10, 710 వద్ద కొనసాగుతున్నాయి.   బ్యాంక్‌ నిఫ్టీ ఐటీ, మెటల్‌ షేర్లు లాభాల్లోనూ , ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎయిర్‌లైన్‌ షేర్లు నష్టపోతున్నాయి.  టాటా స్టీల్‌, సెయిల్‌, టెక్‌ మహీంద్ర,  హిందాల్కో,  ఫెడరల్‌,  సౌత్‌ ఇండియన్‌  బ్యాంకు లాభపడుతుండగా, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, యునైటెడ్‌ స్పిరిట్స్‌ , గోద్రెజ్‌ కన్స్యూమర్‌,జెట్‌ ఎయిర్‌లైన్స్‌, స్పైస్‌ జెట్‌,  నష్టపోతున్నాయి.
మరోవైపు  ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో  మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిస్తే.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి.  

Advertisement
Advertisement