సన్‌లైఫ్‌కు బిర్లా వాటా విక్రయం | Sakshi
Sakshi News home page

సన్‌లైఫ్‌కు బిర్లా వాటా విక్రయం

Published Thu, Dec 3 2015 1:40 AM

సన్‌లైఫ్‌కు బిర్లా వాటా విక్రయం

బీఎస్‌ఎల్‌ఐలో 23 శాతం వాటాకొనుగోలు చేయనున్న సన్‌లైఫ్
 49 శాతానికి పెరిగిన వాటా
 డీల్ విలువ రూ.1,664 కోట్లు
 న్యూఢిల్లీ:
బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ (బీఎస్‌ఎల్‌ఐ)కంపెనీలో కెనడాకు చెందిన సన్ లైఫ్ ఎష్యూరెన్స్ కంపెనీ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది.   బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్రస్తుతం సన్‌లైఫ్ ఎష్యూరెన్స్‌కు 26 శాతం వాటా ఉన్నదని, ఈ వాటాను సన్‌లైఫ్ సంస్థ 49 శాతానికి పెంచుకోనున్నదని ఆదిత్య బిర్లా నువో (ఏబీఎన్‌ఎల్) బీఎస్‌ఈకి నివేదించింది. దీనికి సంబంధించి ఒక ఒప్పందం బుధవారం కుదిరిందని పేర్కొంది. ఈ 23 శాతం వాటాను ఏబీఎన్‌ఎల్ నుంచి సన్‌లైఫ్ సంస్థ రూ. 1,664 కోట్లకు కొనుగోలు చేయనున్నదని, 51 శాతం నియంత్రిత వాటా తమకుంటుందని వివరించింది. ఈ కొనుగోలుతో బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.7,235 కోట్లని వివరించింది.
 
 తమ గ్రూప్‌లో ఆర్థిక సేవల వ్యాపారం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ఈ ఒప్పందం సందర్భంగా ఆదిత్య బిర్లా నువో, బీఎస్‌ఎల్‌ఐ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. బీఎస్‌ఎల్‌ఐ సంస్థ జీవిత బీమా సేవలనందిస్తోంది. ఈ లావాదేవీ వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తవుతుందని అంచనా. బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించడంతో ఆక్సా, స్టాండర్ట్ లైఫ్, నిప్పన్ వంటి విదేశీ కంపెనీలు భారత్‌లో  ని బీమా జేవీలో వాటాను పెంచుకుంటున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement