ఐఎంఎఫ్ ఈడీగా సునీల్ సభర్వాల్ | Sakshi
Sakshi News home page

ఐఎంఎఫ్ ఈడీగా సునీల్ సభర్వాల్

Published Sat, Mar 5 2016 1:18 AM

ఐఎంఎఫ్ ఈడీగా సునీల్ సభర్వాల్

వాషింగ్టన్: స్వతంత్ర ఇన్వెస్టర్ సునీల్ సభర్వాల్ తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆల్టర్నేట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా సెనెట్ సునీల్ నియామకానికి ఆమోదం తెలిపింది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి పదవిని పొందటం ఇదే తొలిసారి. సునీల్ సభర్వాల్ ఇదివరకు యూరోపియన్ ఈ-కామర్స్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ ఒగాన్ బోర్డు చైర్మన్‌గా, జర్మనీకి చెందిన నెట్‌వర్క్ సర్వీసెస్ కంపెనీ ఈజీక్యాష్ కొనుగోలు విషయంలో వార్‌బర్గ్ పింకస్‌కు సలహాదారుడిగా, ఫస్ట్ డేటా కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జీఈ క్యాపిటల్ ఎగ్జిక్యూటి వ్‌గా పలు రకాల బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఓహియో యూనివర్సిటీ నుంచి బీఎస్ పట్టాను, లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంఎస్ పట్టాను పొందారు. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సునీల్‌ను ఈ పదవికి 2014 ఏప్రిల్‌లో తొలిసారి నామినేట్ చేస్తే, అటు తర్వాత గతేడాది మార్చిలో మళ్లీ రెండోసారి నామినేట్ చేశారు.

Advertisement
Advertisement