సింగ్‌ బ్రదర్స్‌కు సుప్రీం మరో షాక్‌ | Sakshi
Sakshi News home page

సింగ్‌ బ్రదర్స్‌కు సుప్రీం మరో షాక్‌

Published Thu, Aug 31 2017 1:36 PM

సింగ్‌ బ్రదర్స్‌కు సుప్రీం మరో షాక్‌ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫోర్టిస్ ఆస్తులను విక్రయించే విషయంలో  సింగ్‌ బ్రదర్స్‌కు  సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ఈ విషయంలో స్టేటస్‌ కో స్థితిని కొనసాగించాలని   గురువారం  సుప్రీం పునరుద్ఘాటించింది.  ప్రమోటర్లు మల్వీందర్‌ సింగ్‌, శివీందర్‌ సింగ్‌.. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల వద్ద తనఖాకు ఉంచిన షేర్లను విక్రయించేందుకు జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా తనఖాలో ఉన్న షేర్లను అమ్మివేసేందుకు బ్యాంకులకు (ఎస్‌ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు) సైతం కోర్టు అనుమతి నిరాకరించింది. వీటితోపాటు నాన్‌ఎన్‌కంబర్డ్‌ షేర్ల విక్రయంపైనా కోర్టు నిషేధాజ్ఞలను కొనసాగాతాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 31 న కేసు తుది విచారణ వరకు  వారి ఆస్తులను ఏమాత్రం తొలగించకుండా ఉండాలని  సుప్రీం ఆదేశించింది.  

ఆస్తుల విక్రయానికి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రమోటర్లు సింగ్‌ బ్రదర్స్‌కు చుక్కెదురు కావడంతో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కౌంటర్‌లో అమ్మకాలకు తెరలేచింది.  ఈ షేరు దాదాపు6.6 శాతం పతనాన్ని నమోదు చేసింది.

కాగా ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు భారీ నష్టపరిహారాన్ని ఎదుర్కొంటున్నారు.  రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని  2016లో సింగపూర్ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశించింది.  వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరింది. అలాగే  డైచీ శాంక్యో  పిటీషన్‌ మేరకు ఆగస్టు 11 ఫోర్టిస్‌ ఆస్తులను, షేర్లను  అమ్మడానికి వీల్లేదని సుప్రీం ఆదేశించింది.  ఫోర్టిస్‌లో వాటాలను విక్రయించడానికి అనుమతి కోసం ఆగస్టు 23న సింగ్‌ సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement