స్వైప్ టెక్నాలజీ ‘మేకిన్ ఇండియా’ | Sakshi
Sakshi News home page

స్వైప్ టెక్నాలజీ ‘మేకిన్ ఇండియా’

Published Thu, Nov 5 2015 12:54 AM

స్వైప్ టెక్నాలజీ ‘మేకిన్ ఇండియా’

జనవరిలో తొలి ఉత్పాదన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టెక్నాలజీ కంపెనీ స్వైప్ టెక్నాలజీస్ పుణే సమీపంలో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది.  ఆరు అసెంబ్లింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో ట్యాబ్లెట్ పీసీలతోపాటు స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తారు. తయారీ, మార్కెటింగ్‌కుగాను వచ్చే రెండేళ్లలో కంపెనీ రూ.130 కోట్లు ఖర్చు చేస్తోంది. మేకిన్ ఇండియా తొలి ఉత్పాదన జనవరి 1న ఆవిష్కరిస్తామని స్వైప్ వ్యవస్థాపకులు శ్రీపాల్ గాంధీ తెలిపారు.

స్మార్ట్ ఫోన్ ఎలీట్-2 మోడల్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాగా4జీ స్మార్ట్‌ఫోన్ ఎలీట్-2 ధర రూ.4,666. ఫ్లిప్‌కార్ట్‌లో నవంబరు 8 నుంచి లభిస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement