ఇదిగో టాటా ‘టియాగో’ | Sakshi
Sakshi News home page

ఇదిగో టాటా ‘టియాగో’

Published Thu, Apr 7 2016 12:26 AM

ఇదిగో టాటా ‘టియాగో’

ముంబై: దేశీ వాహన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త హ్యాచ్‌బాక్ ‘టియాగో’ను బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.20 లక్షలు- రూ.5.54 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ న్యూఢిల్లీ) ఉంది. టియాగో ప్రధానంగా ఎక్స్‌బీ, ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ అనే 5 వేరియంట్లలో లభ్యంకానున్నది. ఎరుపు, బ్లూ, ఆరెంజ్, గోధూమ, తెలుపు, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉండనున్న ఈ వాహనంలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఆకట్టుకునే డిజైన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ , అధునాతన కానెక్ట్‌నెక్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, నావిగేషన్, మల్టీ డ్రైవింగ్ మోడ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఇంజిన్ ఆప్షన్స్
1.2 లీటర్ రెవొట్రాన్ పెట్రోల్
1.05 లీటర్ రెవొటార్క్ డీజిల్
మైలేజ్ (కిలోమీటర్ /లీటర్)
పెట్రోల్ వేరియంట్-23.84
డీజిల్ వేరియంట్-27.28

Advertisement
Advertisement