టాటా ట్రక్ వరల్డ్ ప్రారంభం | Sakshi
Sakshi News home page

టాటా ట్రక్ వరల్డ్ ప్రారంభం

Published Thu, Dec 18 2014 2:30 AM

టాటా ట్రక్ వరల్డ్ ప్రారంభం

విజయవాడలో మూడు రోజుల ప్రదర్శన
 విజయవాడ: దక్షిణ భారత దేశంలో తొలిసారిగా టాటా మోటార్స్ ట్రక్ వరల్డ్ (ట్రక్కుల ప్రదర్శన)ను విజయవాడలో ఏర్పాటుచేశారు. స్థానిక స్వరాజ్య మైదానంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనను బుధవారం ఆ సంస్థ మార్కెటింగ్ సేల్స్ హెడ్ వినోద్ సాహే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. టాటా మోటార్స్   ఉత్పత్తులైన భారీ, మధ్య తరహా వాహనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వినోద్ సాహే మాట్లాడుతూ తమ సంస్థ దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా విస్తరించిందన్నారు. తమ వాహనాలు సుమారు 80 లక్షల వరకు దేశంలోని రహదారులపై నడుస్తున్నాయన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెక్నాలజీతో వాహనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనలో ఉంచిన ప్రైమా రేంజ్ వెహికల్‌ను కామన్ రెయిల్ డైరె క్ట్ ఇంజక్షన్(సీఆర్‌డీఐ) టెక్నాలజీతో రూపొందించామన్నారు. ఇటువంటి వాహనాలను నడపడం వల్ల డ్రైవర్‌కు రక్షణ ఉంటుందని తెలిపారు. టాటా ఆధ్వర్యాన జంషెడ్‌పూర్‌లో అత్యాధునిన పద్ధతిలో టెస్ట్ ట్రాక్‌ను ఏర్పాటుచేశామని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో టాటా సౌత్ రీజినల్ మేనేజర్ ముకుందమూర్తి, ఏరియా మేనేజర్ అబ్రహాంలింకన్, జాస్పర్ ఇండస్ట్రీస్ ఎం.డి. బాడిగ సుమంత్, డెరైక్టర్ పి.వి.సత్యనారాయణ, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement