టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు | Sakshi
Sakshi News home page

టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు

Published Mon, Jul 27 2015 11:47 PM

టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు

ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.676 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ. 631కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా పేర్కొంది. రూపాయి క్షీణతతో  లాభాలు పెరిగాయని వివరించింది.  గత క్యూ1లో 1.1 కోట్ల డాలర్లుగా ఉన్న ఫారెక్స్ లాభాలు ఈ క్యూ1లో 1.47 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొంది. గత క్యూ1లో రూ.5,122 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 23 శాతం వృద్ధితో రూ.6,294 కోట్లకు పెరిగిందని వివరించింది. అంచనాలకనుగుణంగానే తమ ఆర్థిక ఫలితాలున్నాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ క్వార్టర్లో 392 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,03,673కు పెరిగిందని కంపెనీ ఎండీ, సీఈఓ సి. పి. గుర్నాని చెప్పారు.

Advertisement
Advertisement