టెక్ మహింద్రా చేతికి యూకే టార్గెట్ గ్రూప్ | Sakshi
Sakshi News home page

టెక్ మహింద్రా చేతికి యూకే టార్గెట్ గ్రూప్

Published Sat, May 28 2016 2:55 PM

Tech Mahindra To Buy UK's Target Group

న్యూఢిల్లీ : సాప్ట్ వేర్ సర్వీసుల సంస్థ టెక్ మహీంద్రా, యూకేకి చెందిన టార్గెట్ గ్రూప్ ను 12 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసుల స్పేస్ లో తన స్థానాన్ని బలపర్చుకోవడానికి టార్గెట్ గ్రూప్ తో ఈ డీల్ కుదుర్చుకుంది. రుణాలు కల్పించడంలో ఆటోమేటెడ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లకు, ఇన్వెస్ట్ మెంట్లకు, ఇన్సూరెన్సు మార్కెట్ లకు ఈ డీల్ సహకరించనుంది. ఈ ఒప్పందం వల్ల యూకే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ కంపెనీల్లో సాప్ట్ వేర్ సర్వీసులు అందించడానికి టెక్ మహింద్ర వార్షికంగా 45-60 బిలియన్ పౌండ్ లను వెచ్చించనుంది. దీంతో యూకే ఆర్థిక సేవలు అందిస్తున్న షేరును అధిక మొత్తంలో టెక్ మహింద్రానే కలిగిఉంటుంది.

టార్గెట్ గ్రూప్ విలువ 112 మిలియన్ పౌండ్లతో పాటు, సర్ ప్లస్ నగదు 8 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తూ టెక్ మహింద్రా ఈ సంస్థను సొంతంచేసుకోనుంది. ముందస్తుగా 64 మిలియన్ పౌండ్లను టెక్ మహింద్రా, టార్గెట్ గ్రూప్ కు చెల్లించనుంది. అనంతరం 2017లో 16.28 మిలియన్ పౌండ్లను మహింద్రా చెల్లిస్తుంది. ఈ ఒప్పందంతో టెక్ మహింద్రా యూకే లో ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థల్లో టాప్-3 స్థానాన్ని దక్కించుకోనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement