2014 వృద్ధికి చైనా కోత..! | Sakshi
Sakshi News home page

2014 వృద్ధికి చైనా కోత..!

Published Tue, Sep 8 2015 3:03 AM

2014 వృద్ధికి చైనా కోత..!

బీజింగ్: చైనా 2014 స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన తీరుకు ఇది తాజా సంకేతంగా నిలుస్తోంది. 7.4% వృద్ధి రేటే గడచిన 25 ఏళ్లలో కనిష్టమయిన నేపథ్యంలో ఈ రేటు మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం. సవరించిన గణాంకాల ప్రకారం 2014లో స్థూల దేశీయ ఉత్పత్తి విలువ 63.61 ట్రిలియన్ యువాన్లు. (10 ట్రిలియన్ అమెరికా డాలర్లు) అంతక్రితంతో పోల్చితే 32.4 బిలియన్ యన్ (5 బిలియన్ డాలర్లు) తగ్గింది.

Advertisement
Advertisement