బంగారం స్వల్ప వెనకడుగు | Sakshi
Sakshi News home page

బంగారం స్వల్ప వెనకడుగు

Published Tue, May 19 2020 12:09 PM

today gold price - Sakshi

గత రెండు మూడు సెషన్లలో భారీగా పెరిగిన పసిడి ధరలు మంగళవారం ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గి ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.950 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.46,765.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సోమవారం 10 గ్రాముల పసిడి రూ.47,000పైన ట్రేడ్‌ అవుతూ ఒక దశలో 10 గ్రామలు పసిడి ధర రూ.47,980 వద్ద రికార్డుస్థాయి గరిష్టాన్ని తాకింది. 
   అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్న భారీగా దూసుకుపోయిన పసిడి ధర ఈరోజు స్వలంగా తగ్గి ట్రేడ్‌ అవుతోంది. నిన్నటితో పోలిస్తే 23 డాలర్లు పతనమై ఔన్స్‌ బంగారం 1,737.85 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవడం అమెరికా,చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చితితో అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా ర్యాలీ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా దేశంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ కొన్ని సడలింపులతో సమూహాలు గుమ్మికూడని వ్యాపారాలు, కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంతో దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులపై పాక్షికంగా దృష్టిమళ్లీంచడంతో నేడు దేశీయంగా పసిడి ధర స్వల్పలాభాల్లో మాత్రమే ట్రేడ్‌ అవుతోంది. 

Advertisement
Advertisement