అరచేతిలో నెట్వర్క్ సమాచారం | Sakshi
Sakshi News home page

అరచేతిలో నెట్వర్క్ సమాచారం

Published Thu, Aug 11 2016 12:52 AM

అరచేతిలో నెట్వర్క్ సమాచారం

కొత్త పోర్టల్ ను ఆవిష్కరించిన ట్రాయ్

 న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్‌కు చెందిన సమస్త సమాచారాన్ని మనం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చూడొచ్చు. దీనికోసం టెలికం రెగ్యులేటర్ ‘ట్రాయ్’ ఒక కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. గూగుల్  సెర్చ్‌లో ‘హెచ్‌టీటీపీ://అనలిటిక్స్.ట్రాయ్.గవ్.ఇన్’ అనే యూఆర్‌ఎల్‌ను టైప్ చేసి సైట్‌లోకి వెళ్లొచ్చు. ఇక్కడ మనం కాల్ డ్రాప్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూడొచ్చు. అలాగే మనమున్న ప్రాంతంలోని నెట్‌వర్క్ కవరేజ్ సహా ఆయా టెలికం కంపెనీల టవర్లు, సేవల నాణ్యత వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ యుటిలైజేషన్ సహా కాల్ డ్రాప్స్ ట్రెండ్ ఎలా ఉందో చూడొచ్చు. తమ తాజా చర్యలు కేవలం మొబైల్ యూజర్లకే కాకుండా టెలికం కంపెనీలకు కూడా ఉపయోగపడతాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement