సెల్ఫోన్లోనే ట్రయల్ రూమ్! | Sakshi
Sakshi News home page

సెల్ఫోన్లోనే ట్రయల్ రూమ్!

Published Sat, Nov 5 2016 1:23 AM

సెల్ఫోన్లోనే ట్రయల్ రూమ్! - Sakshi

యాప్ నుంచే స్టోర్లలోని దుస్తుల కొనుగోలు
9 బ్రాండ్లు.. 2,500 స్టోర్లతో ఒప్పందం చేసుకున్న ట్రూపిక్
ఈ నెలాఖరులోగా మహిళల ఫ్యాషన్‌‌స కొనుగోళ్లు కూడా..
ఆపైన షూ, కాస్మొటిక్స్ విభాగాలకూ విస్తరణ
రూ.7 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ‘స్టార్టప్ డైరీ’తో ట్రూపిక్
కో-ఫౌండర్ శ్రీధర్ తిరుమల 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండగొస్తుందంటే చాలు! ఇంటిల్లిపాదికి బట్టలు కొనడంలో బిజీగా ఉంటాం. కుటుంబాన్నంతటినీ తీసుకుని షాపింగ్‌కెళతాం. అరుుతే షాపుల్లో ఉన్న వాటిలో మనకు నచ్చినవి కొనడం తప్ప ఏమీ చేయలేం! అలా కాకుండా ఏ ఏ షాపుల్లో ఎలాంటి డిజైనర్, బ్రాండెడ్ దుస్తులున్నాయో తెలుసుకోవటమెలా? అన్ని షాపులూ తిరగటమంటే కష్టం కదా? మరేం చెయ్యాలి? ఉన్న చోటు నుంచే స్థానిక స్టోర్లన్నిటినీ జల్లెడపట్టే పద్ధతేదైనా ఉందా? ఇదిగో... ఈ పద్ధతికి సంక్షిప్త రూపమే ‘ట్రూపిక్’. దీని వివరాలు, విస్తరణ ప్రణాళికల గురించి ట్రూపిక్.కామ్ కో-ఫౌండర్ శ్రీధర్ తిరుమల ‘స్టార్టప్ డైరీ’కి ఏం చెప్పారంటే...

ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక అమెరికాలో మాస్టర్స్ చేయటానికి వెళ్లా. తరవాత అక్కడే సినాప్సిస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైంటిస్ట్‌గా చేరా. కొత్త టెక్నాలజీ, ఉత్పత్తుల మీద పరిశోధనలు చేయడం నా పని. అప్పుడు నేను గమనించిందేంటంటే.. ఫ్యాషన్ రంగంలో తప్ప అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వాడకం విరివిగా ఉంది.  అందుకే ఎలక్ట్రానిక్స్‌ని కొన్నట్టుగా దుస్తులను ఆన్‌లైన్‌లో కొనలేకపోతున్నాం. దీన్నే వ్యాపార వస్తువుగా మార్చాలని నిర్ణరుుంచుకొని 2013లో నాతో పాటు విక్రాంత్ కాట్‌పల్లి, అరవింద్ ఇన్నంపుడి ముగ్గరం కలసి ట్రూపిక్ సాఫ్ట్‌వేర్ పర్సనల్ ఫ్యాషన్ అసిస్టెన్‌‌స టెక్నాలజీని (సోఫియా) అభివృద్ధి చేశాం. ట్రూ అంటే నిజం, పిక్ అంటే ఎంపిక. మొత్తంగా చూస్తే స్వచ్చమైన దుస్తువులు ఎంచుకో అని అర్థం.

 త్రీడీ ట్రయల్ రూమ్..
ట్రూపిక్ ఎలా పనిచేస్తుందంటే.. మైక్రోసాఫ్ట్ కనెక్ట్, సెన్సర్, కెమెరా ఆధారంగా మనిషి శరీరాన్ని ఫొటోల రూపంలో త్రీడీ అవతార్‌ను తయారు చేసుకుంటుంది. వీటిపై మనం ఎంపిక చేసుకున్న దుస్తులు వేస్తే ఎలా ఉంటుందనేది త్రీడీ రూపంలో 360 డిగ్రీల కోణంలో వర్చువల్‌గా చూసుకోవచ్చు. యాప్ వినియోగమెలా అంటే.. ముందుగా కస్టమర్ ట్రూపిక్ యాప్‌లోకి లాగిన్ అరుు.. బ్రాండ్, బాడీ సైజు, ధరలను ఎంచుకోవాలి.

వెంటనే యాప్‌లోని పర్సనల్ ఫ్యాషన్ అసిస్టెన్‌‌స టెక్నాలజీ (సోఫియా) సాఫ్ట్‌వేర్ మీరు ఎంచుకున్న దుస్తులు ట్రూపిక్‌తో ఒప్పందం చేసుకున్న స్టోర్లలో ఎక్కడ దొరుకుతాయో సైజుల వారీగా మీ కళ్ల ముందు ఉంచుతుంది. కావాలంటే నేరుగా కొనుగోలు చేయవచ్చు. లేదా ట్రయల్ చేయాలనుకుంటే ఫ్యాషన్ అసిస్టెంట్స్‌ను రమ్మంటే వాళ్లే మీరు ఎంచుకున్న దుస్తుల్ని ఇంటికి తీసుకొస్తారు. ఇంట్లోనే ట్రయల్ చేసి నచ్చితే అక్కడికక్కడే కొనుగోలు చేయవచ్చు కూడా. కావాలంటే సెల్‌ఫోన్‌లోనే త్రీడీ ట్రయల్ రూమ్ ద్వారా మనం కొన్న దుస్తులు మన శరీరానికెలా ఉంటాయో కూడా చూసుకునే వీలుంటుంది.

9 బ్రాండ్లు, 2,500 స్టోర్లు..
ఐఓఎస్, ఆండ్రారుుడ్ రెండు వర్షన్‌‌స ఉన్నారుు. ఇప్పటివరకు 7 వేల డౌన్‌లోడ్‌‌స అయ్యారుు. ట్రూపిక్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే 75 ఆర్డర్లొస్తే ఇప్పుడు రోజుకు 150కి పైగా ఆర్డర్లొస్తున్నారుు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,500 స్టోర్లతో ఒప్పందం చేసుకున్నాం. హైదరాబాద్‌లోని వాన్ హ్యూసెన్, అలెన్ సోలీ, ఇండియన్ టైుున్, పీటర్ ఇంగ్లండ్, పీపుల్స్, రేమండ్‌‌స, వీల్స్ లైఫ్ స్టరుుల్ వంటి 9 బ్రాండ్లు, 45 స్టోర్లున్నారుు. వీటిలో 7 స్టోర్లలో స్కాన్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశాం. ప్రతి కొనుగోలుపై బ్రాండ్‌‌స నుంచి 10-20 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. మా ఒప్పందం తర్వాత ఆయా స్టోర్లకు 12.08 శాతం ఆదాయం పెరిగింది.

మహిళల ఫ్యాషన్‌‌సలోకి విస్తరణ..
ప్రస్తుతం ట్రూపిక్ యాప్ నుంచి పురుషుల ఫ్యాషన్‌‌స, అపెరల్స్‌ను మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఈ నెలాఖర్లోగా  మహిళల ఫ్యాషన్‌‌స, ఆపైన షూ,  జ్యుయలరీ, కాస్మొటిక్స్ విభాగాలకూ విస్తరించనున్నాం. ‘‘ప్రస్తుతం మా సంస్థలో 33 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి అమెరికా, చైనా ఫ్యాషన్ మార్కెట్లో విస్తరిస్తాం. ట్రూపిక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న సమయంలోనే సిలికాన్‌వ్యాలీకి చెందిన కొమ్మారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ సుమారు రూ.7 కోట్లు పెట్టుబడులు పెట్టారు’’ అని శ్రీధర్ వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

తప్పక చదవండి

Advertisement