Sakshi News home page

టాటా స్టీల్ యూకేపై బ్రిటన్ దర్యాప్తు!

Published Sat, Apr 9 2016 1:26 AM

UK launches fraud probe into Tata Steel: Report

ఉత్పత్తులపై సిబ్బంది తప్పుడు సర్టిఫికేట్లను జారీచేసినట్లు ఆరోపణ
లండన్: బ్రిటన్‌లో నష్టాల్లో కూరుకుపోయిన తన ఉక్కు యూనిట్‌ను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న టాటా గ్రూప్ దిగ్గజ కంపెనీ టాటా స్టీల్ పనితీరుపై బ్రిటన్ క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది. టాటా స్టీల్ అనుబంధ కంపెనీ టాటా స్టీల్ యూకే కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది... ఆ కంపెనీ ఉత్పత్తుల్ని విక్రయించడానికి ముందు ఆ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్లను జారీచేశారన్న ఆరోపణలపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డెయిలీ టెలిగ్రాఫ్ ఒక కథనాన్ని వెలువరించింది.

ఈ అంశంపై టాటా స్టీల్ ఉత్తర ఇంగ్లాండ్‌లో వున్న తన యార్క్‌షైర్ సైట్‌లో ఇంతకుముందే టాటా స్టీల్ అంతర్గత దర్యాప్తు జరిపి, సీరియన్ ఫ్రాడ్ ఆఫీసు (ఎస్‌ఎఫ్‌ఓ)కు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై పీటీఐ ప్రతినిధి ఎస్‌ఎఫ్‌ఓను సంప్రదించగా, ఈ దశలో వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. ఇది మీడియా స్పెక్యులేషన్ అంటూ టాటా స్టీల్ కూడా కొట్టివేసింది. ఈ ఉత్పత్తుల వల్ల ప్రభావితమైన బీఏఈ, రోల్స్‌రాయిస్‌లతో సహా 500 మంది ఖాతాదారులకు సంబంధించిన పత్రాల్ని పోలీసులు పరిశీలించారంటూ డెయిలీ టెలిగ్రాఫ్ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement