యూనియన్‌ బ్యాంక్‌ లాభం 30 శాతం డౌన్‌ | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంక్‌ లాభం 30 శాతం డౌన్‌

Published Fri, Aug 11 2017 2:08 AM

యూనియన్‌ బ్యాంక్‌ లాభం 30 శాతం డౌన్‌

ముంబై: మొండి బాకీలు, భారీ ప్రొవిజనింగ్‌ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 117 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్థులు ఏకంగా 10.16 శాతం నుంచి 12.63 శాతానికి ఎగిశాయి. నికర నిరర్థక ఆస్తులు 6.16 శాతం నుంచి 7.47 శాతానికి పెరిగాయి. 

సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన లాభం పెరిగినప్పటికీ మొండిబాకీలకు కేటాయింపుల వల్ల వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం క్షీణించిందని బ్యాంక్‌ సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రుణాల్లో మరో 4 శాతం కొత్తగా మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు రాయ్‌ పేర్కొన్నారు. మరో 10 ఎన్‌పీఏ ఖాతాలను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ముందుకు పంపాలని యోచిస్తున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement