కోలుకున్న రూపాయి | Sakshi
Sakshi News home page

కోలుకున్న రూపాయి

Published Wed, Oct 19 2016 12:47 AM

కోలుకున్న రూపాయి

డాలర్‌తో 15 పైసల వృద్ధి
66.73 వద్ధ ముగింపు

ముంబై: రూపాయి మంగళవారం ఒక్కరోజే 15పైసల మేర ఫారెక్స్ మార్కెట్లో రికవరీ అయింది. 66.73 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ బలహీన ధోరణి నేపథ్యంలో ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను విక్రయిం చడం రూపాయి కోలుకునేందుకు దోహదం చేసింది. స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి తోడు విదేశీ బ్యాంకులు డాలర్‌పై లాంగ్ పొజిషన్లను కొంత మేర తగ్గించుకోవడం రూపాయి బలపడడానికి ప్రధానంగా కలసివచ్చింది.

అమెరికా తయారీ రంగ గణాంకాలు ఊహించని విధంగా పడిపోవడంతో అంతర్జాతీయంగా ఇతర కరెన్సీలతో డాలర్ బలహీనపడడం రూపాయికి బలాన్నిచ్చిందని ఓ ఫారెక్స్ డీలర్ చెప్పారు. అంతకుముందు సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 17 పైసలు కోల్పోయి 66.88 వద్ద క్లోజ్ కాగా, మంగళవారం ప్రారంభంలోనే 8 పైసల వృద్ధితో 66.80 వద్ద ట్రేడింగ్ ప్రారంభం అయింది. రోజంతా సానుకూల ధోరణిలోనే చలించి చివరికి 66.73 వద్ద క్లోజ్ అయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement