తూత్తుకుడి విషాదం : వేదాంత షేరు ఢమాల్‌ | Sakshi
Sakshi News home page

తూత్తుకుడి విషాదం : వేదాంత షేరు ఢమాల్‌

Published Wed, May 23 2018 12:32 PM

Vedanta Shares Hit Over 10-Month Low as Sterlite Protests Turn Violent - Sakshi

సాక్షి,ముంబై:  తమిళనాడులోని తూత్తుకుడిలో కాల్పుల ఉదంతంతో   వేదాంత షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. వేదాంతకు చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు  కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి మార్కెట్లో వేదాంతా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. 5.5 శాతానికిపైగా  క్షీణించి  10 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది.  జూలై 5, 2017 నాటి స్థాయికి పడిపోయింది.

తమిళనాడును అట్టుడికించిన తూత్తుకూడి  ఘటనపై  స్టెరిలైట్‌ కంపెనీ సీఈవో  రామనాధ్‌ స్పందించారు.  ఈ విధ్వంసం వెనుక కరుడుగట్టిన శక్తులు ఉన్నాయని విమర్శించారు.  ఈ ప్లాంట్‌ నిర్మాణానికి  సంబంధించి పర్యావరణ కాలుష్యం సహా,  ఇతర అన్ని నిబంధనలకనుగుణంగానే తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జూన్‌ 6వతేదీన ఉన్నాయని చెప్పారు.  

Advertisement
Advertisement