వైబర్ నుంచి పబ్లిక్ చాట్ సర్వీస్ | Sakshi
Sakshi News home page

వైబర్ నుంచి పబ్లిక్ చాట్ సర్వీస్

Published Wed, Nov 26 2014 1:29 AM

వైబర్ నుంచి పబ్లిక్ చాట్ సర్వీస్

న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వైబర్ పబ్లిక్ చాట్ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ పబ్లిక్ చాట్‌తో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కమ్యూనిటీలు, సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ కావచ్చు.  పబ్లిక్ చాట్ సర్వీస్ ద్వారా  చాటింగ్ చేయవచ్చని, పబ్లిక్ చాట్స్‌కు ఫ్రెండ్స్‌ను ఇన్వైట్ చేయవచ్చని వైబర్ హెడ్ ఇండియా అనుభవ్ నయ్యర్ చెప్పారు. అంతర్జాతీయంగా వైబర్‌కు 311 మంది చాట్ భాగస్వాములున్నారు. వీరిలో 56 మంది భారత్‌లో ఉన్నారు. వీరిలో అనుష్క శర్మ, రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూర్, షాన్, సచిన్ తేందూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్‌లు కొందరు.

 ఈ ఏడాది చివరికల్లా తమ వినియోగదారుల సంఖ్య 50 కోట్లకు చేరుతుందనేది వైబర్ అంచనా. భారత్, రష్యాల్లో జోరుగా ఉన్న వృద్ధే దీనికి కారణమని వివరించింది. తమకు అత్యధికంగా భారత్‌లోనే యూజర్లున్నారని (3.3 కోట్ల మంది), ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా (3 కోట్లు). రష్యా(2.8 కోట్లు) ఉన్నాయని వైబర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్క్ హర్డీ చెప్పారు. తమకు ఆదాయం వచ్చే అగ్రశ్రేణి ఐదు మార్కెట్లలో భారత్ కూడా ఒకటని వివరించారు. తన ప్లాట్‌ఫామ్‌పై గేమ్స్, మరింత స్థానిక కంటెంట్ ను అందించనున్నామని చెప్పారు.

Advertisement
Advertisement