శంషాబాద్లో విన్సార్ గ్రీన్ అవెన్యూస్ | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో విన్సార్ గ్రీన్ అవెన్యూస్

Published Fri, Oct 21 2016 10:37 PM

శంషాబాద్లో విన్సార్ గ్రీన్ అవెన్యూస్

సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి తొలిసారిగా భారీ లే-అవుట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది శ్రీ కార్తికేయ హౌజింగ్ అండ్ ఇన్‌ఫ్రా. శంషాబాద్‌లోని నందిగామలో 150 ఎకరాల్లో విన్సార్ గ్రీన్ అవెన్యూస్ ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఎండీ ఎం. అశోక్ కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. సోమవారం రోజున బ్రోచర్, నవంబర్ 6న ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామన్నారు. ఆయనింకా ఏమన్నారంటే..

తొలి దశలో 60 ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం. 5, 10 గుంటల్లో స్థలాలను విక్రయిస్తాం. 5 గుంటల్లో 35 మలబార్, 8 గ్రీన్ యాపిల్స్ వస్తాయి. వీటి జీవితకాలం నిర్వహణ బాధ్యత పూర్తిగా కంపెనీదే. చెట్లను విక్రయించగా వచ్చే లాభంలో కస్టమర్‌కు, కంపెనీకి సమాన వాటాలుంటాయి.

18 నెలల గడువుతో నెలసరి వాయిదా పద్ధతిలోను స్థలాన్ని తీసుకోవచ్చు. ఇందులో 3 ఎకరాల్లో రిసార్ట్, సకల సౌకర్యాలూ కల్పిస్తాం.

షాద్‌నగర్‌లో 25 ఎకరాల్లో శ్రీసాయి లక్ష్మి రెసిడెన్సీయ ప్రాజెక్ట్‌ను కూడా చేస్తున్నాం. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 250 ఓపెన్ ప్లాట్లొస్తాయి. 244 నుంచి 288 గజాల్లో ప్లాట్లున్నాయి. గజం ధర రూ.3,600. పార్కు, బీటీ రోడ్లు, అన్ని రకాల సదుపాయాలుంటాయి. రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.

యాదాద్రి భువనగిరి మండలంలోని అనంతారంలో 18 ఎకరాల్లో మై సిటీ-2ను అభివృద్ధి చేస్తున్నాం. 150 నుంచి 300 గజాల్లో ప్లాట్లుంటాయి. గజం ధర రూ.3,300. రాయగిరిలో 18 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. అనుమతులు రాగానే ఈ డిసెంబర్‌లోగా ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం.

Advertisement
Advertisement