రెండింతలకుపైగా పెరిగిన విశాక లాభం | Sakshi
Sakshi News home page

రెండింతలకుపైగా పెరిగిన విశాక లాభం

Published Tue, Feb 13 2018 2:30 AM

Visaka profit doubled - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబర్‌ త్రైమాసికంలో విశాక ఇండస్ట్రీస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.6 కోట్ల నుంచి రూ.14 కోట్లకు ఎగిసింది. టర్నోవరు రూ.220 కోట్ల నుంచి రూ.243 కోట్లకు చేరింది. 2017–18 ఏప్రిల్‌–డిసెంబర్‌లో రూ.787 కోట్ల టర్నోవరుపై రూ.51 కోట్ల నికరలాభం పొందింది.  

సాంఖ్యా ఇన్ఫోటెక్‌ లాభం రూ.1.3 కోట్లు..
గడిచిన త్రైమాసికంలో సాంఖ్యా ఇన్ఫోటెక్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.1.4 కోట్ల నుంచి రూ.1.3 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.38 కోట్ల నుంచి రూ.45 కోట్లకు ఎగిసింది.  

కోరమాండల్‌ అగ్రోకు నష్టం..
డిసెంబర్‌ క్వార్టరులో కోరమాండల్‌ అగ్రో ప్రొడక్ట్స్‌ అండ్‌ ఆయిల్స్‌కు రూ.2 కోట్ల నష్టం వాటిల్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.30 లక్షల నికరలాభం పొందింది. టర్నోవరు రూ.20 కోట్ల నుంచి రూ.23 కోట్లకు చేరింది.  

మూడింతలైన బార్‌ట్రానిక్స్‌ నష్టం
డిసెంబర్‌ త్రైమాసికంలో బార్‌ట్రానిక్స్‌ నష్టాలు క్రితంతో పోలిస్తే మూడింతలై రూ.18 కోట్లకు చేరుకున్నాయి. టర్నోవరు రూ.20 కోట్ల నుంచి రూ.17 కోట్లకు వచ్చి చేరింది.  

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.70 లక్షల లాభం..
డిసెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.70 లక్షల నికరలాభం పొందింది. క్రితం ఏడాది రూ.1.9 కోట్ల నష్టం వచ్చింది. టర్నోవరు రూ.445 కోట్ల నుంచి రూ.489 కోట్లకు ఎగిసింది.  

సూర్యలక్ష్మి కాటన్‌కు రూ.20 లక్షల లాభం..
గడిచిన క్వార్టరులో సూర్యలక్ష్మి కాటన్‌ మిల్స్‌ రూ.20 లక్షల లాభం నమోదు చేసింది. క్రితం ఏడాది కంపెనీకి రూ.61 లక్షల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.146 కోట్ల నుంచి రూ.169 కోట్లకు ఎగిసింది.

60 శాతం తగ్గిన పెబ్స్‌ లాభం..
డిసెంబర్‌ క్వార్టరులో పెబ్స్‌ పెన్నార్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 60 శాతం తగ్గి రూ.2 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.152 కోట్ల నుంచి రూ.117 కోట్లకు వచ్చి చేరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement