డిగ్రీ ఉంటేనే రుణం | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఉంటేనే రుణం

Published Sat, Jan 7 2017 12:11 AM

డిగ్రీ ఉంటేనే రుణం - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రవాసులకు గృహ రుణాల మంజూరులో విద్యార్హత, నడవడిక ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే దేశంలో కేవలం పట్టభద్రులైన ఎన్నారైలకు మాత్రమే గృహరుణం మంజూరవుతుంది మరి. స్థిరాస్తి విలువలో 80 శాతం వరకూ గృహ రుణాన్ని పొందవచ్చు. మిగిలిన మొత్తాన్ని ప్రవాస కొనుగోలుదారుడే వెచ్చించాలి. అయితే ప్రాపర్టీ లావాదేవీలు పూర్తిగా రూపాయిల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్‌ నుంచైనా సరే కానీ ఎన్నారై ఖాతా ద్వారానే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ లేదా ఎఫ్‌సీఎన్‌ఆర్‌ ఖాతాకు చెందిన లేదా పోస్ట్‌ డేట్‌ చెక్స్, ఎలక్ట్రానిక్‌ క్లియరెన్స్‌ సర్వీస్‌ (ఈసీఎస్‌) ద్వారా కూడా చెల్లించవచ్చు.

ఒకవేళ విదేశాల్లో ఉంటూ.. అక్కడ సంపాదిస్తుంటే గనక స్థానిక బ్యాంకుల నుంచి నిధులను తీసుకొని ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలు ఎన్నారైలకుంటుంది. ఎందుకంటే మన దేశంతో పోల్చుకుంటే కొన్ని దేశాల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ఒకవేళ ప్రాపర్టీని వినియోగించలేని పక్షంలో అద్దెకిచ్చేసి అద్దెను బ్యాంకు రుణ చెల్లింపులో వినియోగిస్తే మాత్రం.. స్థానిక బంధువుల హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వారి స్థానిక బ్యాంక్‌ ఖాతాకు చెందిన చెక్కులను కూడా జారీ చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement