27 నెలల కనిష్టానికి రూపాయి | Sakshi
Sakshi News home page

27 నెలల కనిష్టానికి రూపాయి

Published Tue, Dec 15 2015 1:28 AM

27 నెలల కనిష్టానికి రూపాయి - Sakshi

21 పైసల నష్టంతో 67.09 వద్ద ముగింపు

ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై అనిశ్చిత పరిస్థితులు శిఖర స్థాయికి చేరడంతో డాలర్‌తో రూపాయి మారకం 27 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో  శుక్రవారం 66.88 వద్ద ముగిసిన రూపాయి సోమవారం నాడు 67.09 వద్ద బలహీనంగా ప్రారంభమైంది.

డాలర్లకు డిమాండ్ జోరుగా పెరగడంతో రూపాయి మరింత బలహీనపడి 67.12కు పడిపోయింది. చివరకు శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 21 పైసలు (0.31 శాతం)నష్టపోయి 67.09 వద్ద ముగిసింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచనుండటంతో విదేశీ నిధులు భారీగా తరలిపోతాయనే ఆందోళన రూపాయిపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని నిపుణులంటున్నారు.

అయితే నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి ఐదేళ్ల గరిష్టానికి పెరగడంతో స్టాక్ మార్కెట్ లాభపడింది. దీంతో రూపాయి నష్టాలకు కళ్లెం పడిందని వారంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి 5.9% క్షీణించింది.

Advertisement
Advertisement