వాట్సాప్‌లోకి ఆ ఫీచర్‌.. ఇక డోంట్‌ వర్రీ | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లోకి ఆ ఫీచర్‌.. ఇక డోంట్‌ వర్రీ

Published Fri, Oct 27 2017 12:33 PM

WhatsApp will finally let you delete sent messages

మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రాచుర్యం దక్కించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంది. తాజాగా ఎప్పటినుంచో వేచిచూస్తున్న మెసేజ్‌లను డిలీట్‌ చేసిన ఫీచర్‌ను కూడా తీసుకొచ్చేసింది. వాట్సాప్‌లో ఒకసారి మెసేజ్‌ పంపితే దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు ఒకరికి పంపాల్సిన మెసేజ్‌లను మరొకరికి పంపడం లాంటివి చేస్తూ ఇబ్బందులు పడుతుంటాం. ఇక వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఈ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ను ఏడు నిమిషాల వ్యవధిలో యూజర్లు దాన్ని డిలీట్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఒకవేళ ఈ వ్యవధిలో డిలీట్‌ చేయకపోతే, ఆ మెసేజ్‌ పంపిన వారి ఇన్‌బాక్స్‌లోకి అది వెళ్లిపోతుంది. 

మెసేజ్‌లను డిలీట్‌ చేసే సమయంలో రెండు ఆప్షన్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఒకటి 'డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌' రెండు 'డిలీట్‌ ఫర్‌ మి'. మొదటి దానితో యూజర్‌ చాలామందికి లేదా రిసీవర్‌కు పంపిన మెసేజ్‌లను డిలీట్‌ చేయొచ్చు. ఈ డిలీట్‌ ఆప్షన్‌ మెనూలో యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే మెసేజ్‌లను రిసీవ్‌ చేసుకునే వారు కూడా వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ కలిగి ఉండాల్సి ఉంది. అప్పుడైతేనే విజయవంతంగా మెసేజ్‌లను డిలీట్‌ చేయొచ్చు. 'డిలీట్‌ ఫర్‌ మి' ఫీచర్‌తో కేవలం యూజర్‌ చాట్‌ నుంచి మాత్రమే మెసేజ్‌ను తొలగించవచ్చు. మెసేజ్‌ను అందుకునే వారి ఇన్‌బాక్స్‌లో ఆ మెసేజ్‌ అలానే ఉంటుంది. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లు, విండోస్‌ ఫోన్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. 

Advertisement
Advertisement