టాప్‌–10లో 7 మారుతీ కార్లే.. | Sakshi
Sakshi News home page

టాప్‌–10లో 7 మారుతీ కార్లే..

Published Mon, Aug 28 2017 1:06 AM

టాప్‌–10లో 7 మారుతీ కార్లే..

న్యూఢిల్లీ: జూలై నెల కార్ల అమ్మకాలకు సంబంధించి టాప్‌–10 ప్యాసింజర్‌ వాహనాల్లో మారుతీ సుజుకీవే 7 మోడల్స్‌ ఉన్నాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో మారుతీ ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. 25,009 ఆల్టోల విక్రయాలు జరగ్గా, 19,153 యూనిట్లతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో ద్వితీయస్థానాన్ని ఆక్రమించింది. వేగన్‌ ఆర్‌ 16,301 యూనిట్ల అమ్మకాలతో తృతీయస్థానంలో నిలిచింది.

15,243 యూనిట్ల విక్రయాలతో విటారా బ్రెజా, 13,738 యూనిట్లతో స్విఫ్ట్‌ తదుపరి స్థానాల్లో నిలిచాయి. హ్యుందాయ్‌ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ గ్రాండ్‌ ఐ 10 ఆరో స్థానంలో (12,002 యూనిట్లు), హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ 20 (11,390 యూనిట్లు), 6,7వ స్థానాల్ని సంపాదించగా, మారుతీ డిజైర్‌ 11,187 యూనిట్లతో 8వ స్థానంలోనూ, ఇదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్‌ సెలెరియో 9వ స్థానంలో (11,087 యూనిట్లు) ఉన్నాయి. హ్యుందాయ్‌ ఎస్‌యూవీ క్రెటా 10,556 యూనిట్లతో 10వ స్థానంలో ఉంది. 

Advertisement
Advertisement