కార్యాలయం నుంచి కార్పొరేట్ బోర్డుల దాకా... మహిళలకు తప్పని వివక్ష | Sakshi
Sakshi News home page

కార్యాలయం నుంచి కార్పొరేట్ బోర్డుల దాకా... మహిళలకు తప్పని వివక్ష

Published Sun, Mar 8 2015 2:52 AM

కార్యాలయం నుంచి కార్పొరేట్ బోర్డుల దాకా... మహిళలకు తప్పని వివక్ష

కార్యాలయంలోనే కాదు... వేతనాలు, పనివేళలు, ఆఖరికి కార్పొరేట్ బోర్డుల్లోనూ మహిళల పట్ల వివక్షే కనిపిస్తోంది. కొన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వారిని మినహాయిస్తే... మెజారిటీ మహిళలు పలు అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 48 శాతం మంది మహిళలున్నారు. లింగ వివక్ష సూచీలోని 152 దేశాల్లో మనది 127వ ర్యాంకు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నేటి మహిళ’ పరిస్థితి చూద్దాం.
 
మహిళల పురోగతిలో అట్టడుగున భారత్
ఆర్థిక, సామాజికాంశాల్లో మహిళలకు సమానత్వానికి సంబంధించి 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ అట్టడుగు స్థాయిలో నిల్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. మాస్టర్‌కార్డ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనిప్రకారం ఆసియా పసిఫిక్ దేశాల్లోని మహిళ లు విద్య విషయంలో పురుషుల కంటే ముందు ఉంటున్నప్పటికీ, వ్యాపారాల్లో.. రాజకీయాల్లో వారితో సమానత్వం ఉండటం లేదు. సమానత్వానికి సంబంధించి న్యూజిలాండ్ ఇండెక్స్ స్కోరు అత్యధికంగా 77గా ఉండగా, భారత్ మాత్రం 44.2 స్కోరుతో అట్టడుగు స్థానాన్ని దక్కించుకుంది.
 
మహిళా డెరైక్టర్లు తక్కువే...
ప్రతి లిస్టెడ్ కంపెనీలోనూ ఒక మహిళా డెరైక్టర్ ఉండాలని కంపెనీల చట్టం నిర్దేశిస్తోంది. కానీ బీఎస్‌ఈ 200 కంపెనీల బోర్డుల్లో మహిళలు కేవలం 9.5 శాతం. ఇంకా రీసెర్చ్ సంస్థ క్యాటలిస్ట్ నివేదించిన దాని ప్రకారం ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే...
 
వేతనాల్లోనూ తేడాలే...
ఐటీ రంగంలో కనీస వేతనం గంటకు రూ.291. ఇది సగటున గంటకు రూ.341. ఇతర రంగాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే పురుషులతో పోలిస్తే ఇక్కడ కూడా మహిళలు 34% తక్కువ జీతాల్ని పొందుతున్నట్లు ఆన్‌లైన్ కెరీర్, నియామకాల సొల్యూషన్స్ ప్రొవైడర్ మాన్‌స్టర్ ఇండియా పేర్కొంది.  వివిధ రంగాల సగటు జీతాలు గంటకు... విద్యారంగంలో మహిళలు ఎక్కువ ఉండటమే తక్కువ జీతాలకు కారణమన్నది అభిప్రాయం.

 దావోస్‌కు వెళ్లినవారిని చూసినా...
ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలువురు మహిళా వ్యాపార దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. మొత్తం 2,500 మంది డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటుండగా వీరిలో మహిళలు 17 శాతం మందే. గడిచిన 2-3 ఏళ్లలో మహిళల సంఖ్య ఇదే స్థాయిలో ఉంది. ఇందులోనూ భారత్ నుంచి హాజరవుతున్న వారి సంఖ్య మరీ తక్కువ.
 
రాత్రి షిఫ్ట్‌లలో తగ్గుతున్న మహిళలు...
రాత్రి షిఫ్ట్ ఉండే కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27% తగ్గిందని అసోచామ్ వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి రావడం, భద్రత, తదితర అంశాలు ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భద్రతకు సంబంధించి ఆందోళన అధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో ఉన్నాయి.  మహిళల భద్రతకు సంబంధించి దక్షిణాది నగరాల్లో ఒకింత మెరుగైన పరిస్థితులున్నాయి. రిటైర్‌మెంట్ అనంతర వ్యయాల విషయంలో పురుషులకన్నా, స్త్రీలు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సర్వే ఒకటి తెలిపింది.

Advertisement
Advertisement