రెడ్‌మి 5 కమింగ్‌, లాంచింగ్‌ ఆ రోజే | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 5 కమింగ్‌, లాంచింగ్‌ ఆ రోజే

Published Mon, Feb 5 2018 1:07 PM

Xiaomi Redmi 5 India Launch Expected on February 14 - Sakshi

చైనీస్‌ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమి, తన 2018 తొలి ప్రొడక్ట్‌ను భారత్‌లో లాంచ్‌ చేయబోతుంది. దీని కోసం కంపెనీ బిగ్‌ ''5'' లోగోతో ఆహ్వానాలు కూడా పంపుతోంది. ఈ ఆహ్వాన పత్రికల మేరకు షావోమి తన లేటెస్ట్‌ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 5నే భారత్‌లో లాంచ్‌ చేస్తుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 14న ఈ లాంచింగ్‌ ఈవెంట్‌ జరుగబోతుంది. ఈ ఈవెంట్‌లోనే రెడ్‌మి 5 ప్లస్‌ కూడా వస్తుందో లేదో ఇంకా స్పష్టతలేదు. 2జీబీ ర్యామ్‌ / 16జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌ / 32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌ / 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైందని తెలుస్తోంది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత డిసెంబర్‌లోనే లాంచ్‌ చేశారు. బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల వేరియంట్లలో అక్కడ మార్కెట్‌లోకి వచ్చింది. రెడ్‌మి 5తో పాటు రెడ్‌మి 5 ప్లస్‌ను కూడా చైనాలో లాంచ్‌ చేశారు. రెడ్‌మి 5 ధర అక్కడ 799 సీఎన్‌వై నుంచి అంటే రూ.8100గా ప్రారంభం కాగ, రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సీఎన్‌వై 999(రూ.10,200) నుంచి ప్రారంభమైంది.  కానీ భారత్‌లో ఈ ఫోన్‌ ధర ఏ మేర ఉంటుందో ఇంకా తెలియలేదు. 
 

రెడ్‌మి 5, 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల స్పెషిఫికేషన్లు...
డ్యూయల్‌-సిమ్
ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆధారితంగా ఎంఐయూఐ 9తో రన్‌
రెడ్‌మి 5కి 5.7 అంగుళాల డిస్‌ప్లే
రెడ్‌మి 5 ప్లస్‌కి 5.99 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌కి 2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్‌
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ 
రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌కి 3జీబీ/ 4జీబీ ర్యామ్‌
32జీబీ/ 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ 
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
రెడ్‌మి 5- 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
రెడ్‌మి 5 ప్లస్‌కు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement