స్వల్పంగా దిగివచ్చిన బంగారం | Sakshi
Sakshi News home page

స్వల్పంగా దిగివచ్చిన బంగారం

Published Wed, Jul 8 2020 12:06 PM

Yellow metal retreat from highs - Sakshi

మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. నేటి ఉదయం సెషన్‌లో 10గ్రాముల బంగారం రూ.150లు నష్టపోయి రూ.48650 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.575లు పెరిగిన తర్వాత బంగారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో రిస్క్‌ అసెట్స్‌లైన​ఈక్విటీల కొనుగోలుకు మొగ్గుచూపడం బం‍గారం ధర దిగివచ్చేందుకు కారణమైనట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. బంగారం దిగివచ్చిన ఈ నేపథ్యంలో రూ.49,000-49,200 టార్గెట్‌ ధరతో పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చని వారు సలహానిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు బంగారం పతనాన్ని పరిమితం చేస్తున్నాయి. నిన్న ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.575లు లాభపడి రూ.48800 వద్ద స్థిరపడింది. 
అంతర్జాతీయంగా తగ్గుదలే: 
అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అయితే 1800డాలర్లపైనే కొనసాగుతుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ఔన్స్‌ బంగారం ధర 4డాలర్లు నష్టాన్ని చవిచూసి 1,805.85డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతానికి బంగారం ధర దిగివచ్చినప్పటికీ.., రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తితో కుంటుబడిన ఆర్థికవృద్ధికి ఆయాదేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గింపుతో పాటు ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. తక్కువ వడ్డీరేట్లు, ఉద్దీపన ప్యాకేజీలతో బంగారం ధర మరింత ర్యాలీ చేస్తుందని వారంటున్నారు. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరగడంతో నిన్నరాత్రి అమెరికాలో 16డాలర్లు పెరిగి 1809 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ధర పసిడికి దాదాపు 9ఏళ్ల గరిష్టస్థాయి కావడం విశేషం.

Advertisement
Advertisement