మాకు భేదాలుండవు! | Sakshi
Sakshi News home page

మాకు భేదాలుండవు!

Published Tue, Oct 24 2017 4:51 PM

cricketer who plays for India is a ‘Hindustani

న్యూఢిల్లీ : భారతదేశం తరఫున క్రికెట్‌ ఆడేవాళ్లంతా.. భారతీయులే అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. సంజీవ్‌ భట్‌ అనే మాజీ ఐపీఎస్‌ అధికారి చేసిన వివాదాస్పద ట్వీట్‌కు హర్భజన్‌ ఘాటుగానే ట్విటర్‌లో సమాధానమిచ్చారు. ప్రస్తుత భారత జట్టులో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు లేరు? ముస్లింలు క్రికెట్‌ ఆడడం లేదా? లేక సెలక్షన్‌ పాలసీలో ఎవైనా మార్పులు చోటు చేసుకున్నాయా? అని సంజీవ్‌ భట్‌ ట్విటర్‌లో ప్రశ్నల పరంపర కురింపించారు.

సంజీవ్‌ భట్‌కు భర్భజన్‌ ట్విటర్‌లోనే సమాధానమిచ్చారు. భారత జాతీయ జట్టుకు ఆడే సమయంలో.. ఎవరు కులం, వర్గం, వర్ణం, ప్రాంతం, మతం వంటి వాటిని పట్టించుకోరని హర్భజన్‌ చెప్పారు. జట్టులో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు అందరూ సోదరుల్లా దేశం కోసం ఆడతారని హర్భజన్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు, శ్రీలంకతో జరిగే రెండు టెస్టులకు హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి ఎంపికయ్యారు. అలాగే టెస్టు జట్టులో మహమ్మద్‌ షమీ తన స్థానాన్ని కాపాడుకున్నారు.

Advertisement
Advertisement