విద్యార్థినిపై ఏబీవీపీ నాయకుడి దాడి

21 Nov, 2019 10:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒంగోలు: తమ కార్యక్రమానికి పిలిస్తే రాలేనన్నందుకు ఏబీవీపీ నాయకుడు హనమంతు తనపై భౌతిక దాడికి దిగాడని ఒంగోలు శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని బుధవారం ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బుధవారం స్థానిక పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏబీవీపీ నాయకులు మిషన్‌ సాహసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యారి్థనీ, విద్యార్థులను పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు స్థానిక రంగారాయుడు చెరువు పక్కన ఉన్న శ్రీ చైతన్య ఒంగోలు క్యాంపస్‌కు వెళ్లి తరగతి గదుల్లో ఉన్న విద్యారి్థనులను కార్యక్రమానికి రావాలని ఏబీవీపీ నాయకులు హుకుం జారీ చేశారు. ఫిర్యాది తనకు అనారోగ్యంగా ఉందని, తాను రాలేనని చెప్పడంతో ఆగ్రహించిన హనుమంతు తన చున్నీ పట్టుకుని లాగి ఎగ్జామ్‌ ప్యాడ్‌తో తన ఎడమ భుజంపై కొట్టాడని, రాకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత విద్యారి్థని ఫిర్యాదు మేరకు ఏబీవీపీ నాయకుడు హనుమంతుపై ఒన్‌టౌన్‌ జియో హనుమంతురావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇదేం విధానం? 
కాలేజీకి విద్యార్థుల కోసం వెళ్తే తల్లిదండ్రులను సైతం దూరంగా ఉంచే కాలేజీ సిబ్బంది, ఒక విద్యార్థి సంఘ నాయకులు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే నేరుగా తరగతి గదుల్లోకి ఎలా అనుమతిచ్చారంటూ విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దారుణమేనని, తామే తమ బిడ్డపై చేయి చేసుకోమని, మీరెవరు చేయి చేసుకోవడానికి అంటూ నిలదీశారు. గతంలో కూడా ఇదే కాలేజీలో ఓ విద్యార్థి సంఘ నాయకుడు మీటింగ్‌ ఏర్పాటు చేసి ఏకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరిన విషయం రచ్చరచ్చగా మారిన విషయం విదితమే. అదే క్యాంపస్‌లో మరోమారు ఘటన జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు