పాములతో జర పైలం...!   | Sakshi
Sakshi News home page

పాములతో జర పైలం...!  

Published Tue, Jul 3 2018 1:24 PM

Be Careful With Snakes - Sakshi

తిరుమలగిరి (నాగార్నుసాగర్‌) : వానాకాలం మొదలైందంటే చాలు... బుసలు కొడుతున్న పాములు చల్లదనాన్ని వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి కాటువేసే ప్రమాదం ఉంది. చెట్ల పొదలు, పాత ఇల్లు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్పాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృతిచెందుతున్నారు.

ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుం ది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ మరికొందరు రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. పంటలు సాగుచేసేందుకు రైతులు రాత్రింబవళ్లనే తేడా లేకుండా పొలాలకు వెళ్తుంటారు. కురిసిన చిరు జల్లులకు చెట్ల పొదలు ఎక్కువగా పెరిగి పాముల సంచారం అధికమువుతుంది.

మైదానాల్లో ఆడుకునే చిన్నపిల్లలు, రాత్రిపూట పూరిగుడిలో నిద్రపోతున్న వారు పాముకాటుకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారుపడిపోతూ నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నా మూఢనమ్మకాలతో మం త్రాలు చేయించడం, పసరు మందులు వాడటం లాంటివి చేస్తుంటారు.

దీంతో ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాటువైద్యాన్ని ఆశ్రయించవద్దని, ప్రభుత్వాస్పత్రుల్లో పాముకాటు నివారణకు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయని గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విస్తతంగా ప్రచారం నిర్వహించాలి. కానీ అవి ఎక్కడా మ చ్చుకైనా కనిపించకపోవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

పొలం పనులు చేసే రైతులు అడవుల్లో పశువుల వెంట తిరిగే వారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పని సరిగ్గా టార్చిలైట్‌ను వెంట తీసుకెళ్లాలి.పాములు ఎక్కువగా మొకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులను ధరించాలి.

కాళ్ల కిందకు ఉంటే బట్టలను వేసుకోవాలి. కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు నిర్వహించుకోవాలి.ఒక వేళ పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ప్రథమ చికిత్స

  • కాటువేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి
  • పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమి లేదని చెప్పాలి.
  •      కాటు వేసిన చోటుకు మూడు అంగుళాలపై భాగాన బట్టతో కట్టాలి.
  •      పాముకాటు వేసినప్పుడు నోటితో, బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు.
  •      పాముకాటుకు గురైన వెంటనే కంగారుపడి నాటువైద్యులను ఆశ్రయించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.  

Advertisement
Advertisement