బావే హతమార్చాడు | Sakshi
Sakshi News home page

బావే హతమార్చాడు

Published Wed, Mar 7 2018 12:01 PM

brother in law himself only  mudered sister in law - Sakshi

సిద్దిపేటటౌన్‌: సొంత మరదలిపై కన్నేశాడు.. తనను పెళ్లి చేసుకోవాలని లేదా శారీరకంగా సహకరించాలని వేధించాడు. అయినా వినకపోవడంతో దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఒంటరిగా బావి వద్ద ఉందని తెలుసుకొని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. నన్ను కాదని వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడతావా..? నాకు సహకరించవా అంటూ నిలదీయడంతో ప్రతిఘటించిన ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.

ఆపై అనుమానం రాకుండా ఉండడానికి మృతదేహంపై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. ఈ నెల 2న మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చెట్లకింది సుహాసిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనపై మృతురాలి అక్క మౌనిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చివరికి నిందుతుడిని పట్టుకున్నారు. మంగళవారం సిద్దిపేట అడిషనల్‌ డీసీపీ జి. నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
 
రుద్రారం గ్రామానికి చెందిన చెట్లకింది సంజీవ్‌కు ఇద్దరు కూతుళ్లు మౌనిక, సుహాసిని. మెదక్‌ జిల్లా నిజాంపేటకు చెందిన గరిగుల అశోక్‌(27) మౌనికను చూసేందుకు వచ్చి సుహాసిని నచ్చడంతో ఆమెనే పెళ్లి చేసుకుంటానని అందరికి చెప్పాడు. దానికి మౌనిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయిష్టంగానే మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి తర్వాత కూడా మరదలైన సుహాసినిని లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో మృతురాలు నిజాంపేటకు చెందిన ఒక వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న విషయం అశోక్‌కు నచ్చక ఆమెను మందలించాడు.

మరుసటి రోజు బావి వద్ద సుహాసిని ఒక్కతే ఉన్న సమయంలో నిందితుడు అఘాయిత్యం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించి నెట్టేయడంతో కోపోద్రిక్తుడైన అశోక్‌ సుహాసిని గొంతు బలంగా పట్టుకోవడంతో మృతిచెందింది. దీంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న కిరోసిన్‌ను మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకు నే క్రమంలో డాగ్‌ స్క్వాడ్‌ మృతురాలి తండ్రి సంజీవ్‌ వద్దకు వెళ్లి ఆగిపోయింది.

కానీ దీన్ని నమ్మని పోలీసులు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌ నేతృత్వంలో విచారణను వేగవంతం చేసి నిందితుడి కాల్‌ డేటాను విశ్లేషించగా అసలు విషయం బయటపడిం ది. పోలీసుల విచారణలో నిందితుడు అసలు విష యం ఒప్పుకున్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక సీఐ నిరంజన్, మిరుదొడ్డి ఎస్సై విజయభాస్కర్, దుబ్బాక ఎస్సై సు భాష్, కానిస్టేబుల్‌ విష్ణు కీలకంగా వ్యవహరించారని వారిని కమిషనరేట్‌ తరఫున అభినందించారు.

నిందితుడిని చూపుతున్న అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement