అక్కపై అత్యాచార యత్నం | Sakshi
Sakshi News home page

అక్కపై అత్యాచార యత్నం

Published Fri, Jan 12 2018 6:53 AM

brother sexual assult on sister - Sakshi

నంబులపూలకుంట : వావి వరుసలు మరిచి అక్కపైనే అత్యాచార యత్నం చేశాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులేకుండా రాజీకి రావాలని దంపతులపై మళ్లీ దాడి చేసిన ఘటన మేకలచెరువులో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ వివాహితకు వరుసకు చిన్నమ్మ కొడుకు ఆమె భర్త  ఇంట్లో లేనప్పుడు అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయగా స్థాని కులు  ఇంటి వద్దకు రావడంతో పారిపోయాడు.  విషయాన్ని గ్రామస్తులతో పాటు బాధితురాలి అత్తమామలు భర్తకు తెలియజేశారు.

మరుసటి రోజు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌బాబు విచారణ చేపట్టారు. నిందితుడు  తన బంధువులతో ఇంటి వద్దకు వచ్చి కేసు లేకుండా రాజీకి పోవాలని, లేకపోతే ‘నీ అంతుచూస్తాం’ అంటూ దాడి చేశారు. వారి దాడిలో బాధితురాలి భర్తకు గాయాలయ్యాయి.  బాధితులు  తమకు రక్షణ కల్పించాలంటూ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ రమేష్‌బాబును మాట్లాడుతూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇరువర్గాల వారు గొడవపడి దాడి చేసుకున్నట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారన్నారు. కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement