Sakshi News home page

హాకీ జట్టు మాజీ కెప్టెన్‌పై కేసు నమోదు

Published Wed, Feb 13 2019 3:41 PM

Case Filed Against Former Hockey Captain Mukesh Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌, అర్జున్‌ అవార్డు గ్రహీత ముఖేష్‌ కుమార్‌పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై హైదరాబాద్‌ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్‌ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్‌ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైంది. దీంతో రెండు వారాల క్రితం ముఖేష్‌పై కేసు నమోదు చేశాం. మూడు రోజులుగా ముఖేష్‌ పరారీలో ఉన్నారు.. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నాం. ముఖేష్‌తో పాటు అతని తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశామ’ని తెలిపారు. కాగా, కెరీర్‌లో 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముఖేష్‌ 80 గోల్స్‌ చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement