వెబ్‌ సిరీస్‌ సీన్లు పోర్న్‌ సైట్‌లో.. నటికి షాక్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 2 2018 12:59 PM

Casting director Cheats tricking actor - Sakshi

ముంబై : అవకాశాల పేరిట యువతిని మోసం చేసి.. ఆమె నటించిన సీన్లను దుర్వినియోగం చేశాడు ఓ దర్శకుడు. అడల్ట్‌ చిత్రాల్లో, పోర్న్‌ సైట్‌లో వాటిని అప్‌ లోడ్‌ చేశాడు. కంగుతిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఓషివారా పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం... వెబ్‌ సిరీస్‌ పేరిట రాజన్‌ అగర్వాల్‌ అనే కాస్టింగ్‌ డైరెక్టర్‌ 2015లో ఓ ప్రకటన ఇచ్చాడు. అది చూసి లోఖంద్‌వాలాకు చెందిన ఓ యువతి(26) రాజన్‌ను సంప్రదించింది. మొత్తం ఐదు సీజన్లుగా తీస్తానని.. అన్నింటిలో నువ్వే హీరోయిన్‌వంటూ ఆమెను అతను నమ్మబలికాడు. ఒకరోజు షూటింగ్‌ పేరిట మధ్‌ ఐలాండ్‌లో ఆమెతో కొన్ని హాట్‌ సీన్లను చిత్రీకరించాడు. అయితే ఆ వ్యవహారం అక్కడితోనే ముగిసిపోయింది. 

మిగతా షూటింగ్‌ కోసం ఆమె ఫోన్‌ చేసినా లిఫ్ట్‌​ చేయకపోవటంతో ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. ఇదిలా ఉంటే గతేడాది యూట్యూబ్‌లో ఓ అడల్ట్‌ చిత్రాన్ని అప్‌ లోడ్‌ చేసిన సదరు దర్శకుడు ఆమె నటించిన సీన్లను అందులో కలిపేశాడు. ఇది గమనించిన ఆ యువతి స్నేహితుడొకరు విషయాన్ని ఆమె దృష్టికి తేవటంతో యువతి ఆగ్రహానికి లోనై రాజన్‌ను నిలదీసింది. కానీ, అతను స్పందించలేదు. కొన్నాళ్ల క్రితం ఓ పోర్న్‌ సైట్‌ లో కూడా అవే దృశ్యాలు దర్శనమివ్వటంతో పోలీసులకు రాజన్‌పై ఫిర్యాదు చేసింది. రాజన్‌ను అరెస్ట్‌ చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు ఉపేంద్ర రాయ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు  ఓషివారా పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement