సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

6 Sep, 2019 10:53 IST|Sakshi

బంజారాహిల్స్‌: గంజాయికి అలవాటు పడి సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించార. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్‌ ఏసీపీ కే.ఎస్‌.రావు, ఇన్‌స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి,  వివరాలు వెల్లడించారు. శ్రీకాకులం జిల్లా, జగన్నాథపుర గ్రామానికి చెందిన పెద్దింటి యాదగిరి సెంట్రింగ్‌ వర్కర్‌గా పనిచేస్తూ మూసాపేట యాదవ బస్తీలో తన స్నేహితుడు మహ్మద్‌ జజ్బార్‌ అహ్మద్‌తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరు కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్నారు. గత నెల 26న బోరబండకు చెందిన సతీష్‌ అనే డ్రైవర్, జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌ 36లో నడిచి వెళుతుండగా బైక్‌పై వచ్చిన వీరు సెల్‌ఫోన్‌ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్‌ పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు