బాలుడితో చోరీ చేయించిన తండ్రి | Sakshi
Sakshi News home page

తండ్రి డైరెక్షన్‌.. కుమారుడి యాక్షన్‌

Published Wed, Jul 3 2019 8:05 AM

Child Robbery in Neighbors House With Father Direction - Sakshi

పహాడీషరీఫ్‌: మైనర్‌ కుమారుడితో కలిసి పొరుగింట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు. అతడి నుంచి 10.5 తులాల బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణతో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించా రు. బాలాపూర్‌ సీపీఎన్‌ఆర్‌ గ్రీన్‌ సిటీకి చెందిన సయ్యద్‌ సొహేల్‌ ఖాద్రీ  కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ సంపాదన కుటుంబపోషణకు సరిపోకపోవడంతో దొంగతనం చేయాలని భావించాడు. ఇందులో భాగంగా వారి పొరుగింట్లో ఉంటున్న మహ్మద్‌ మునీరుద్దీన్‌ ఇంటికి తాళం వేసి అప్పుడప్పుడు బయటికి వెళ్లేవాడు.

ఆ సమయంలో అత ను ఇంటి తాళం చెవిని బయట ఉన్న వాషింగ్‌ మి ష¯Œ  లో ఉంచేవాడు.దీనిని గుర్తించిన సొహేల్‌ చోరీకి పథకం పన్నాడు. ఇందులో భాగంగా జనవరి 13న మునీర్‌ తాళం వేసి బయటికి వెళ్లిన విషయాన్ని పసిగట్టిన సొహేల్‌ తెల్లవారుజామన ప్రహరీ పైనుంచి తన కుమారుడిని లోపలికి దింపాడు. అతను వాషింగ్‌ మిషన్‌లోని తాళం చెవి తీసుకుని ఇంట్లోకి వెళ్లి  రెండు బంగారు గాజులు, ఒక నెక్లెస్, ఒక నల్లపూసల దండ, పది ఉంగరాలు, ఒక నక్లెస్, చెంప స్వరాలతో పాటు రూ.34 వేల నగదును చోరీ చేశాడు. యధావిధిగా తాళం వేసి వచ్చాడు. మరుసటి రోజు ఉదదం బాధితుడు బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం శివాజీ చౌక్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు యాక్టివాపై వెళుతున్న వారిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి  10.5 తులాల బంగారు ఆభరణాలు, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు, అదనపు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సుధీర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement