సెల్ఫీని చూపిస్తూ ఏమిటని ప్రశ్నించారు.. | Sakshi
Sakshi News home page

ఆధారాల కోసమే అజ్ఞాతంలోకి..

Published Thu, Dec 28 2017 9:27 AM

Comedian Vijay Sai's Wife Vanitha Surrendered - Sakshi

బంజారాహిల్స్‌: ఈ నెల 11న యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులోని తన ప్లాట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సినీ హాస్యనటుడు విజయ్‌సాయి భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. చనిపోయే ముందు విజయ్‌ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు ఆమెతో పాటు లాయర్‌ శ్రీనుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె ఇన్నాళ్లూ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాను ఆధారాలు సేకరించేందుకే  పోలీసుల ఎదుటకు రాలేకపోయానని వెల్లడించారు. విజయ్‌ చనిపోయిన తర్వాత అతనిపై ఒక సానుభూతితో అంద రూ మాట్లాడుతున్నారు తప్పితే నిజానిజా లు ఏంటో ఎవరికీ తెలియడం లేదన్నారు.

నిజాలేంటో నిరూపించేందుకోసమే ఆధారాలు సేకరించడానికి ఇన్నాళ్లు రాలేకపోయానన్నారు. కొన్ని ఆధారాలు తన అడ్వకేట్‌ దగ్గర కూడా ఉన్నాయన్నారు. గత మూడేళ్లుగా విజయ్, తా ను వేర్వేరుగా ఉంటున్నామని వెల్లడించారు. విజయ్‌ వీడియోలో పేర్కొన్న అంశాల్లో వాస్తవా లు లేవని తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునేందుకు ఆధారాల సేకరణకు సమ యం పట్టడంతోనే ఇన్ని రోజులు పోలీసుల ఎదుట హాజరుకాలేకపోయానన్నారు. తాను ఉపయోగించిన కారు తండ్రి తనకు ఇచ్చాడని విజయ్‌ సెల్ఫీలో ఆరోపించిన వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. శ్రీనివాస్‌ తన న్యాయవాది అని న్యాయపరంగా ఆయన తన  కు సలహాలు, సూచనలు ఇస్తున్నారని చెప్పారు.

పోలీసులకు లొంగిపొమ్మంటే ఇప్పు డే లొంగిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. విజయ్‌ సెల్ఫీలోతనపై ఎందుకు ఆరోపణలు చేశాడో అర్థం కావడం లేదని అయితే తన తప్పు లేదనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నా యని చెప్పారు. మూడేళ్లుగా దూరంగా ఉన్న వ్య క్తిని తాను ఎలా వేధిస్తానని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా వనితారెడ్డికి పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఆమెను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. విజయ్‌ సెల్ఫీలో ఆరోపించిన విషయాలపై ఆరా తీశారు. ఆమె ముందే విజయ్‌ సెల్ఫీని చూపిస్తూ వాటికి సమాధానాలు ఏమిటని ప్రశ్నించారు. మధ్యా హ్నం 2 గంటల కు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వనిత సాయంత్రం వరకు పోలీసుల విచారణలో ఉన్నారు.

Advertisement
Advertisement