కంటెయినర్‌ బీభత్సం | Sakshi
Sakshi News home page

కంటెయినర్‌ బీభత్సం

Published Sat, Jun 30 2018 11:50 AM

Container Roll Overed In Visakhapatnam - Sakshi

పెదవాల్తేరు(విశాఖతూర్పు): సమయం తెల్లవారుజాము 2 గంటలు.. కొత్తవెంకోజీపాలెం జాతీయ రహదారిపై ఆంజనేయస్వామి ఆలయం మలుపులో పెద్ద శబ్దం... ఏమైందోనని ఇళ్లలోంచి ప్రజలు బయటకొచ్చి చూసేసరికి  కంటెయినర్‌ లారీ బోల్తా పడింది... ట్రాలర్‌ ఇంజిన్‌ నుంచి విడిపోయింది. ఆ సమయంలో జనసంచారం లేకపో వడంతో పెను ప్రమాదం తప్పింది.  ఇంజిన్‌ ఢీకొ నడంతో పది బైక్‌లు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న పాత చెక్కల దుకాణంలో కర్రలు విరిగి పోయాయి. తమిళనాడుకు చెందిన కంటెయినర్‌ లారీ ఇనుప దిమ్మల లోడుతో ఒడిశా వెళుతోంది. మార్గమధ్యలో కొత్తవెంకోజీపాలెం జాతీయ రహదారిపై మలుపు వద్ద ఇంజిన్‌ డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పింది. కంటెయినర్‌ బోల్తా పడింది.

కాగా, డ్రైవర్‌ మద్యం మత్తులో ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున కావడం, ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు.  ప్రమాదం కారణంగా ఫుట్‌పాత్‌పై, రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన 10 ద్విచక్రవాహనాలను ఇంజిన్‌ ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. పాత చెక్కల దుకాణం ధ్వంసమవ్వడంతో యజమానులకు నష్టం వాటిల్లింది. గురువారమే పాతచెక్కల స్టాకు తీసుకొచ్చామని యజ మాని చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ట్రాఫిక్, ఎంవీపీ, రోడ్‌సేఫ్టీ పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని కంటెయినర్‌ ను క్రేన్‌ సాయంతో ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా తరలించారు. లారీ క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని ఎంవీపీ స్టేషన్‌కు తరలించారు. ఎంవీపీ సీఐ కరణం ఈశ్వరరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement