కామాంధుడికి కటకటాలు | Sakshi
Sakshi News home page

కామాంధుడికి కటకటాలు

Published Thu, Dec 14 2017 11:01 AM

criminal arrest

సాక్షి, సీతమ్మధార (విశాఖ ఉత‍్తరం):  ఒక ప్రైవేటు సంస‍్థను నడుపుతూ  పలువురు  మహిళలకు వలవేయడమే కాకుండా..  వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ  అసభ్యకరంగా ప్రవర్తిస్తున‍్న కామంధుడిని నాలుగో పట్టణ పోలీసులు కటకటాల్లోకి పంపించారు.  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నగరం ద్వారకానగర్‌  మొదటిలైన్‌లో  అశ్వర్‌ హోమ్స్‌ మొదటి అంతస్థులో దాడిశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి కొద్ది కాలంగా ఇన్ఫ్‌టెక్‌ ప్రెసిషన్‌ అనే సంస‍్థతో పాటు ఫైర్‌ సేఫ్టీ కోర్సులు  నడుపుతున్నాడు. తన వద్ద పనిచేసే ఉద్యోగినులకు వలవేసి రాసలీలలు నడపడమే కాకుండా వాటిని వీడియోలు తీసి వేధిస్తున్నాడు. ఉద్యోగినులు లొంగకపోతే వీడియోలు ఫేస్‌బుక్‌లో పెడతానని భయపెట్టేవాడు. అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగిని భర్త వేరే వ‍్యక్తి ద్వారా అసభ‍్యకర వీడియోలను చూసి తన భార్యను కూడా లొంగదీసుకుంటాడేమోనని భయపడి సంస‍్థకు వెళ్లి శ్రీనివాసరావును నిలదీశాడు.  అంతేకాకుండా అతను నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాసరావును బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement