డ్రిల్లింగ్‌ మెషీన్‌, కుక్కర్లలో బంగారు కడ్డీలు.. | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

Published Sat, Mar 23 2019 10:38 AM

Custom Officers Nabbed Two Men In Gold Smuggling In RGIA In Hyderabad - Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్‌ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగేజీ తనిఖీల క్రమంలో నిందితులు పట్టుబడ్డాడు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్‌ మెషీన్‌ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్‌ అధికారులు వాటిని వెలికి తీశారు. మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావు కిలో చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపారు.

అదే విధంగా.. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్‌ కోటింగ్‌ వేసిన గోల్డ్‌ ప్లేట్లను కుక్కర్‌లో దాచి ఉంచగా బ్యాగేజ్‌ తనిఖీల్లో బయటపడ్డాయి.

Advertisement
Advertisement