పెట్టుబడి పేరుతో వంచన.. యువతి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

పెట్టుబడి పేరుతో వంచన.. యువతి అరెస్ట్‌

Published Sat, Oct 28 2017 2:31 AM

Deceit by investing in the name of the woman

బనశంకరి: ఫ్యషన్, బ్రాండింగ్‌ తదితర ప్రకటన రంగాల్లో పెట్టుబడులు పెట్టాల ని ప్రజలను ఆహ్వానించి వంచనకు పాల్పడిన యువతిని శుక్రవారం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జార్ఘండ్‌ రాష్ట్రంలోని జెమ్‌షెడ్‌పూర్‌కు చెందిన ఒండ్రిల్లాదాస్‌గుప్తా అనే యువతి జర్నలిజం కోర్సు పూర్తిచేసి ఓ ఇంగ్లిష్‌ పత్రికలో పనిచేసింది. అనంతరం ప్రసిద్ధ ఫ్యషన్‌ మ్యాగజైన్‌లో చేరడంతో ఫ్యాషన్‌ రంగానికి పరిచయమైంది. అనంతరం  eatshoplove.in కంపెనీని స్థాపించింది. 

ఫ్యాషన్, బ్రాండింగ్‌ ప్రకటనల రంగంలో తాను స్థాపించిన కంపెనీకి పెట్టుబడులు కావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేసింది. దీన్ని చూసిన కొందరు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బు  జమచేసేవారు. తన వాక్‌చాతుర్యంతో ప్రజలనుంచి లక్షలాదిరూపాయలు తన అకౌంట్‌లో వేయించుకుని వారిని వంచించింది. బాధితులు కొంతమంది బెంగళూరు నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సైబర్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించడంతో వీరు తీవ్రంగా గాలించి శుక్రవారం ఉదయం డిల్లీలో ఒండ్రిల్లాదాస్‌గుప్తాను అరెస్ట్‌చేసి  నగరానికి తీసుకువచ్చి విచారణ చేపడుతున్నారు. 

Advertisement
Advertisement