భర్త కలలోకి వస్తున్నాడని... | Sakshi
Sakshi News home page

భర్త కలలోకి వస్తున్నాడని...

Published Sun, Oct 21 2018 8:17 AM

Family Suicide Attempt In YSR Kadapa - Sakshi

పతినే ప్రాణంగా భావించింది... ఆయన లేడన్న నిజం నిత్యం తనను బాధించింది.. ఆర్నెళ్ల నుంచి కన్నీరుమున్నీరుగా విలపించింది.. ముగ్గురు పిల్లల పోషణ భారమైంది... చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం పిల్లల పాలిట శాపమైంది.. తాను ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను అనాథలను చేసింది. ఈఘటన శనివారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.పతినే ప్రాణంగా భావించింది... ఆయన లేడన్న నిజం నిత్యం తనను బాధించింది.. ఆర్నెళ్ల నుంచి కన్నీరుమున్నీరుగా విలపించింది.. ముగ్గురు పిల్లల పోషణ భారమైంది... చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం పిల్లల పాలిట శాపమైంది.. తాను ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను అనాథలను చేసింది. ఈఘటన శనివారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.

ప్రొద్దుటూరు క్రైం: భర్త లేడన్న బాధతో చౌడు శ్రీలక్ష్మి (44) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని ఆచార్లకాలనీ, శ్రీనివాసపురంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త సుధాకర్‌ ఆరు నెలల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన భార్య శ్రీలక్ష్మి తీవ్ర మనోవేదనతో బాధపడుతూ ఉండేది. రాత్రి వేళల్లో భర్త కలలోకి వస్తున్నాడని, అతను పక్కనే ఉన్నట్లు తనకు అనిపిస్తోందని పిల్లలతో చెప్పేది.

కుమార్తెలు, బంధువులు ఆమెకు ధైర్యం చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో వారి ఇంటి పక్కన ఒక మహిళ శనివారం మృతి చెందడంతో ఉదయం 6 గంటల సమయంలో ఆమె నిద్రలేచి మృతదేహాన్ని కూడా చూశారు. అయితే 6.30 గంటల తర్వాత కుమార్తెలు నిద్రలేచి చూస్తే తల్లి బెడ్‌రూంలో కనిపించలేదు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ ఉంది. పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న బంధువులు వచ్చి చూడగా ఆమె మృతి చెందింది.
 
కాటేసిన మద్యం
చౌడు సుధాకర్‌ చేనేత పని చేసేవాడు. గతంలో అతను మద్యం బాగా తాగేవాడు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. మద్యం తాగడం మానుకోవాలని ఆమె భర్తను కోరేది. భార్య అభ్యర్థన మేరకు సుధాకర్‌ మద్యం తాగడం మానేశాడు. కొన్ని నెలల తర్వాత బంధువుల పెళ్లికి వెళ్లిన సుధాకర్‌ మద్యం సేవించి నడవలేని స్థితిలో ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన శ్రీలక్ష్మి తీవ్ర ఆవేదన చెందారు. తాగనని చెప్పి మళ్లీ తాగి ఇంటికి వస్తారా అంటూ భర్తతో చెప్పారు. తాగనని మాట ఇచ్చి మద్యం తాగి రావడం, భార్య బాధ పడటం చూసిన అతను ఆవేదనకు లోనయ్యాడు.

ఈ క్రమంలోనే మగ్గం కొయ్యకు చీర కట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను ఎంతగానో ప్రేమించే శ్రీలక్ష్మి ఆయన మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయింది. భర్త దూరమైన నాటి నుంచి ఆమె దిగులుగా ఉంటోంది. పిల్లలే ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో భర్త ఆత్మహత్య చేసుకున్న చోటే ఆమె కూడా మగ్గం కొయ్యకు చీర కట్టుకొని ఉరి వేసుకుంది. అర్బన్‌ సీఐ జయానాయక్, ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

అనాథలైన పిల్లలు...

ఆర్నేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సుధాకర్, శ్రీలక్ష్మికి ధరణి, చరణి  ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కార్తీ్తక్‌   ఉన్నాడు. ధరణి బీటెక్, చరణి తొమ్మిది, కుమారుడు ఆరో తరగతి చదువుతున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కుమార్తెలు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది. ఒంటరి వారిని చేసి వెళ్లిపోయారా అంటూ గుండెలు పగిలిలేలా విలపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement