నాన్నే చంపేశాడు..! | Sakshi
Sakshi News home page

నాన్నే చంపేశాడు..!

Published Mon, Dec 3 2018 1:01 PM

Father Killed Son in Prakasam - Sakshi

ప్రకాశం, చీమకుర్తి: అంతా అనుకున్నట్లే జరిగింది. కన్న కొడుకు షేక్‌ సాహుల్‌ (3)ను తండ్రి షేక్‌ ఖాదర్‌వలి కిరాతకంగా చంపేశాడు. కత్తితో పీక కోసి డంపింగ్‌ యార్డులో ఉన్న పెద్ద రాళ్ల మధ్య పూడ్చిపైన గోతాలు, గడ్డితో కప్పేశాడు. చీమకుర్తికి సమీపంలో 10 కిలోమీటర్లు దూరంలో కర్నూల్‌ రోడ్డుకు దగ్గరలో ఉన్న యల్లయ్యనగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఏఎస్‌ పేటకు చెందిన షేక్‌ ఖాదర్‌వలి, సల్మా బేల్దారీ పనుల కోసం నాలుగేళ్ల నుంచి యల్లయ్యనగర్‌లో నివశిస్తున్నారు. దంపతుల మధ్య తరుచూ గోడవల కారణంగా తనను తీసుకెళ్లాలని సల్మా తన అన్నదమ్ములకు సమాచారం అందించింది. ఆమెను నెల్లూరు తీసుకెళ్లేందుకు శుక్రవారం బంధువులు వచ్చారు. ఈ నేపథ్యంలో కొడుకు తనకు పుట్టలేదనే అనుమానం ఉంచుకున్నాడు పెంచుకున్నాడు ఖాదర్‌వలి. అనంతరం కొడుకును బైకుపై ఎక్కించుకొని కొనిపెడతానంటూ బంకుల వద్దకు తీసుకెళ్లాడు.

యల్లయ్యనగర్‌కు సమీపంలో ఉన్న ఎర్రకొండ డంపింయ్‌ యార్డుల వైపు తీసుకెళ్లి కొడుకు పీక అతి దారుణంగా కోసి చంపేశాడు. తర్వాత చుట్టుపక్కల ఉన్న బండలు పైనపెట్టి శవం బయటకు కనిపించకుండా గోతం కప్పి పైన గడ్డి మొక్కలు చల్లేసి ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం సాహుల్‌ కనిపించడం లేదని తండ్రి ఖాదర్‌వలికి బంధువులు చెప్పారు. తనకు తెలియదని, బంకు వద్దకు తీసుకెళ్లి తినుబండారాలు కొనిపెట్టి మళ్లీ ఇంటి వద్దే వదిలి పెట్టానని నమ్మించాడు. అనుమానంతో శుక్రవారం రాత్రి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈలోపు శనివారం కూడా అదృశ్యమైన సాహుల్‌ కనిపించకపోవడంతో ఆదివారం పిల్లోడి తండ్రి ఖాదర్‌వలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటలకు తన కుమారుడిని చంపేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు తీశారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ జీవీ చౌదరి సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు కారణాలు సేకరిస్తున్నారు. 

భార్యపై దాడి
కుమారుడి హత్య విషయం వెలుగులోకి రాక ముదు అంటే శనివారం రాత్రి మొత్తం సల్మాను భర్త ఖాదర్‌వలి కొడుతూనే ఉన్నాడు. కుమారుడు ఎక్కడకు వెళ్లింది తల్లి చూసుకోవద్దా.. అంటూ వేధించాడు. కుమారుడిని చంపిన తండ్రిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement