రూమ్‌ మేట్స్‌ నగ్న ఫోటోలు పంపి, ఆపై... | Sakshi
Sakshi News home page

రూమ్‌ మేట్స్‌ నగ్న ఫోటోలు పంపి, ఆపై సూసైడ్‌

Published Thu, Sep 28 2017 11:58 AM

Girl Send Nude Pics of Roomates Commit Suicide - Sakshi

సాక్షి, ముంబై :  ప్రియుడి కోసం రహస్యంగా తన స్నేహితురాళ్ల నగ్న ఫోటోలను తీసి పంపింది ఓ అమ్మాయి. అయితే అది కాస్త భయటపడటంతో.. భయంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్‌ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ముంబై మిర్రర్‌ కథనం ప్రకారం... సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యనభ్యసిస్తున్న వృశాలి లండే(21) స్థానికంగా ఓ హస్టల్‌లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే సురేశ్‌ అనే యువకుడితో చనువుగా ఉండేది. వీరిద్దరి మధ్య రోజు ఫోన్‌ సంభాషణలు కొనసాగుతుండేవి. ఇలా ఉండగా ఓ రోజు తన ఇద్దరు రూమ్‌మేట్స్‌కి తెలీకుండా వారి నగ్న ఫోటోలు తీసి సురేశ్‌కు పంపింది. అయితే వారిద్దరి మధ్య జరిగిన ఛాటింగ్‌ను ఓ అమ్మాయి చదవటంతో విషయం బయటపడింది. సురేశ్‌ బలవంతం మేరకే తాను ఆ పని చేశానని ఒప్పేసుకోవటంతో.. అలా ఓ పేపర్‌ మీద రాసిచ్చి ఇకపై సురేశ్‌తో మాట్లాడటం మానేయాలని, లేకపోతే పోలీస్‌ ఫిర్యాదు చేస్తామని వాళ్లు హెచ్చరించి వదిలేశారు. 

అయినప్పటికీ వృశాలి అతనితో మాట్లాడటం మానలేదు. సెప్టెంబర్‌ 23న ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, కోపంగా వృశాలి హస్టల్‌ నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోవటంతో హస్టల్‌ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా, పోలీస్‌ విచారణలో ఆ ఇద్దరూ అమ్మాయిలు జరిగిన వివరించారు. కానీ, అప్పటికే వారిద్దరు సమీపంలోని స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటిరోజు వృశాలి గది నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement