దారుణం.. కజిన్ కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి..

17 Nov, 2019 18:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. 16ఏళ్ల ఓ బాలుడు తనకు మరదలు వరుసయ్యే 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను మంచానికి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 51 ఏరియాలో గురువారం ఈ ఘటన జరగ్గా, ఆసల్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది.  ఆ బాలిక స్కూల్లో స్పృహ తప్పి పడిపోవడంతో టీచర్ ఆమెను విచారించింది. దీంతో జరిగిన ఘటనను ఆమెకు వెల్లడించింది. సదరు టీచర్ బాలిక తల్లికి అసలు విషయం చెప్పడంతో..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల తమ ఆడపడుచుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. ఇంట్లో పనులు చేసేందుకు కుమార్తెను పంపించానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో.. ఆమె కొడుకు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఆమె కాళ్లు,చేతులను బెడ్‌కి కట్టేసి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా