అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్యను..

7 Mar, 2020 10:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మరో మహిళతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగిన భార్యను ఓ భర్త కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన సదాశివనగర్‌ మండలంలోని సాజ్యనాయక్‌ తండాలో శుక్రవారం తెల్లవాజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తండాకు చెందిన శివరాం మొదటి భార్యను ఒప్పించి 20 ఏళ్ల క్రితం రెండో నాందేడ్‌ జిల్లా ఉమ్రిలోని ఉండతండాకు మేనక(40)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి భార్య లింమ్డిబాయికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరి భార్యలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే రెండో భార్య మేనకకు శివరాంకు తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మేనక, శివరాంను మరో మహిళతో అక్రమ సంబంధం విషయమై ప్రశ్నించింది. దీంతో ఆమెను శివరాం తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మేనకను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు శివరాంపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్, ఎస్సై నరేశ్‌ తెలిపారు.  

మృతదేహంతో నిరసన
మేనకను చంపిన శివరాంను కఠినంగా శిక్షించా లని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగా రు. నాందేడ్‌ నుంచి మృతురాలి కుటుంబీకులు వచ్చే వరకు మృతదేహాన్ని తరలించలేదు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు