అనుమానంతో భార్యపై కత్తితో దాడి

11 Feb, 2019 13:30 IST|Sakshi
భర్త చేతిలో తీవ్రంగా గాయపడ్డ మహేశ్వరి

పోలంపల్లి(వత్సవాయి): భార్యపై అనుమానంతో కొబ్బరిబొండాలు నరికే కత్తితో భర్త దాడిచేశాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలంపల్లి  గ్రామానికి చెందిన కొయ్యల బాలకృష్ణకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన మహేశ్వరితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9 సంవత్సరాల కుమార్తె ఉంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ రెండేళ్లుగా గ్రామాన్ని విడిచి బయటే ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పోతుండేవాడు. గ్రామానికి వచ్చినప్పుడల్లా భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన బాలకృష్ణ భార్యతో గొడవ పడ్డాడు.

ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొబ్బరిబొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేశాడు. కాళ్లు, చేతులపై నరికాడు. అనంతరం స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్‌ఐ పి. ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని మహేశ్వరి పరిస్థితిని గమనించగా ఆమె ఊపిరితో ఉంది. వెంటనే 108 వాహనంలో జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాణాలు తీస్తున్న ఫలితాలు

‘భరత్‌పూర్‌’ భరతం పట్టలేరా?

చిన్నారుల కిడ్నాప్‌ కేసులో ఇద్దరు మహిళల అరెస్ట్‌

నేను అమ్ములు(అనిత)కు కరెక్ట్‌ పర్సన్‌ కాదు..

కుక్క మృతికి కారణమైన ఆస్పత్రిపై ఫిర్యాదు

స్నేహితుడు మాట్లాడటం లేదని..

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో స్నేహితులతో కలిసి..

బెంగాల్‌లో నోడల్‌ అధికారి అదృశ్యం

ఐదుగురిని తొక్కేసిన ఏనుగు..

రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఉతికి ఆరేసింది.. 

ఎన్డీ తివారీ కుమారుడి మృతి కేసులో కొత్తమలుపు

పరీక్షల్లో ఫెయిల్‌.. ఆరుగురి ఆత్మహత్య..!

రేవ్‌ పార్టీకి పెద్దల అండ

కాయ్‌ రాజా కాయ్‌..

ట్రాలీ ఆటో ఢీ..ఇద్దరు దుర్మరణం

గోదావరిలో దూకి యువతి ఆత్మహత్య?

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

రాత్రికి రాత్రి సర్వజనాస్పత్రి నుంచి ఖైదీ డిశ్చార్జ్‌

‘రేప్‌’ చేసి.. దారుణహత్య!

పెద్దలు ప్రేమను నిరాకరించారని..

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి

మితిమీరిన వేగం.. పోయింది ముగ్గురి ప్రాణం

ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా..

‘నా సోదరి మీదే దాడి చేస్తావా..!’

ప్రేమ వ్యవహారమే కారణమా..?

నిద్రిస్తున్న మహిళపై పెట్రోల్‌ పోసి..

పసికందు మృతదేహం కుక్కలపాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేసవిలో నాగకన్య...

చెక్‌ ఇవ్వాలనుంది

దట్టమైన అడవిలో...

నట విశ్వరూపం

మొదలైన చోటే ముగింపు

నంబర్‌ 3