తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

26 Jul, 2019 12:12 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ రవీందర్‌

సాక్షి, కాజీపేట : వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల ముఠా, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ డాక్టర్‌ రవీందర్‌ వివరాలను వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన గాజుల యోగేందర్‌ అలియాస్‌ యుగెందర్‌ అలియాస్‌ యోగి, కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన నూనె కిష్టమ్మ, శ్రీపాతి లింగమ్మలను అదుపులోకి తీసుకుని, రూ.18లక్షల విలువైన 361 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, నాలుగు వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలపారు. 

జల్సాలకు అలవాటు పడి చోరీలు....
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యోగెందర్‌ కలర్‌ పేయింట్‌ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. చెడు వ్యసనాలకు బానిసై, సంపాదిస్తున్న డబ్బు జల్సాలకు 
సరిపోకపోవడంతో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడని కమిషనర్‌ తెలిపారు. 2012 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా తిరుమలగిరి, అళ్వాల్‌ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. బయటికి వచ్చాక తన పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు.

అనంతరం వరంగల్‌కు మార్చిన యోగేందర్‌ చోరీలు చేస్తుండేవాడు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగు, సుబేదారి, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కోక్క చోరీలకు పాల్పడ్డాడు. ఇంతేజార్‌గంజ్‌ ఇన్స్‌పెక్టర్‌ డీ.శ్రీధర్‌ ఆదేశాల మేరకు గురువారం ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ రై ల్వే స్టేషన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా తారసపడిన యోగేందర్‌ను విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.

నిందితుడి వద్ద నుంచి రూ.13.79లక్షల విలువైన 241 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, 4 ల్యా ప్‌ట్యాప్‌లు, 4 వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకుని, నిందితుడి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. రెండు సంఘటనల్లో నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కేఆర్‌.నాగరాజు, వరంగల్, కాజీపేట, ఏసీపీలు నర్సయ్య, నర్సింగరావు,పలువురు ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

రెచ్చగొట్టే పాట : సింగర్‌ అరెస్టు

రౌడీషీటర్‌ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!

కట్టుకున్నోళ్లే కడతేర్చారు

స్మగ్లింగ్‌ స్పెషలిస్ట్‌

దళిత సేవలో నాలుగో సింహం

ఎస్‌ఐ బైక్‌నే కొట్టేశార్రా బాబూ!

మాటల్లో దించి కారులో..

యువతి వేధిస్తోందని...

బెదిరించడం.. దోచుకెళ్లడం

కన్నా.. కనిపించరా..!

‘చనిపోవాలని ఉంది.. మిస్‌ యూ ఫ్రెండ్స్‌’

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

వంశీ కేసులో కొత్త కోణం

బాలికపై లైంగికదాడి

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

మాజీ డ్రైవరే సూత్రధారి

యువతి అపహరణ

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కుక్క కోసం కత్తిపోట్లు

గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్‌..!

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!

తెలిసిన వాడే కాటేశాడు

400 మెసేజ్‌లు.. షాకయిన బాధితుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో