Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Published Sat, Apr 14 2018 7:21 AM

Love Couple Request to Police shelters - Sakshi

పళ్లిపట్టు:  కులాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమజంట శుక్రవారం పొదటూరుపేట పోలీసులను ఆశ్రయించారు. వధూవరులు ఇద్దరూ మేజర్‌ కావడంతో కొత్త జంటకు పోలీసులు శుభాకాంక్షలు తెలిపి పంపారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపం పొదటూరుపేట టౌన్‌ చవటూరుకు చెందిన శేఖర్‌ కుమార్తె  పొర్కొడి(22) వారం రోజుల ముందు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పొర్కొడి, ఈచ్చంతోపు గ్రామానికి చెందిన తాపిమేస్త్రి కుమారుడు ఉమాపతి(24) అనే యువకుడితో పొర్కొడికి వివాహం జరిగి తమకు రక్షణ కల్పించాలని పొదటూరుపేట పోలీసులను ఆశ్రయించారు.

ఈ సందర్భంగా  పోలీసుల విచారణలో పొర్కొడి, ఉమాపతి ప్రయివేటు కర్మాగారంలో పనిచేసే సమయంలో వారిమధ్య ప్రేమ చిగురించినట్లు, అయితే వారి వివాహానికి కులం అడ్డుకావడంతో ఇరు కుటుంబాల వారు వ్యతిరేకించిన నేపథ్యంలో తిరుపతికి వెళ్లి అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి కుటుంబాల నుంచి తమకు వ్యతిరేకత ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఇద్దరూ మేజర్‌ కావడంతో వారిని తిరుత్తణి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరు రక్షణ కల్పిస్తామని  వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు తగిన రక్షణ కల్పిస్తామని పోలీసులు  తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement