నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

16 Jul, 2019 10:39 IST|Sakshi

కోల్‌కతా : ప్రముఖ టెలివిజన్‌ నటి, మోడల్‌ అరుణిమా ఘోష్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకర​ కామెంట్లు చేసిన వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. దక్షిణ కోల్‌కతాలోని గార్ఫా ప్రాంతానికి చెందిన ముఖేష్‌ షా అనే వ్యక్తి అరుణిమాపై సోషల్‌మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఫేక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకొని తరచూ ఆమెను వేధించాడు. అతని వేధింపులు రోజు రోజుకి మితిమీరి పోవడంతో ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ముఖేష్‌ను అరెస్ట్‌ చేశారు. ముఖేష్‌ మయూఖ్‌ అనే పేరుతో నకిలీ అకౌంట్‌ ఏర్పాటు చేసి ఆమెను బెదిరించాడని పోలీసులు తెలిపారు.

కాగా ఈ విషయంపై నటి అరుణిమా మాట్లాడుతూ.. తాను ఇలాంటి కామెంట్లను పట్టించుకోనని, కానీ అతని వెధింపులు రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో పోలీసులను సంప్రదించానని తెలిపారు. ప్రతి రోజు తాను ఎక్కడికి వెళ్లినా ఆ విషయాలను సోషల్‌ మీడియాతో ద్వారా చెబుతున్నాడని, తనను ఫాలో అవుతూ బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ముఖేష్‌ను అరెస్ట్‌ చేశామని, అతను ఎందుకు అలాంటి అసభ్యకర కామెంట్లు చేశాడు? అతని మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు